Fact Check : మిసైల్ ను ప్రయోగించడంలో భారత్ విఫలమైందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 July 2020 3:21 PM IST
Fact Check : మిసైల్ ను ప్రయోగించడంలో భారత్ విఫలమైందా..?

భారత్ మిసైల్ ను ప్రయోగించడంలో విఫలమైందంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఖాట్మండు, నేపాల్ కు చెందిన ట్విట్టర్ యూజర్ @Irmaknepal జులై 15న ఓ మిసైల్ విఫలమైన వీడియోను తన ట్విట్టర్ ఘాట్లలో పోస్టు చేశాడు. “Indian missile test is failed. Can this type of Army fight against Nepal? (sic)” అంటూ వీడియోను పోస్టు చేశాడు.



అలా పైకెగిరిన రాకెట్ కొన్ని క్షణాల్లోనే కూలిపోవడం ఆ వీడియోలో గమనించవచ్చు.

పాకిస్థాన్ కు చెందిన యుట్యూబ్ ఛానల్ కూడా ఆ వీడియోను పోస్టు చేసింది. భారత్ మిసైల్ టెస్ట్ ఫెయిల్ అయిందంటూ వీడియోను వైరల్ చేశారు.

నిజ నిర్ధారణ:

భారత్ మిసైల్ టెస్ట్ చేసి.. విఫలమైందంటూ చెబుతున్న కథనాలు అబద్ధం.

ఆ యూట్యూబ్ ఛానల్ లో కొందరు అది రష్యాకు చెందిన మిసైల్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. న్యూస్ మీటర్ ఈ వీడియోకు చెందిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్, యాండెక్స్ లలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. యాండెక్స్ లో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం లభించింది. Russian Proton-M rocket(రష్యన్ ప్రోటాన్ ఎం రాకెట్) పేలిపోయిన ఘటన ఇదని పలు మీడియా సంస్థలు కథనాలను వెల్లడించాయి.

న్యూస్ రిపోర్ట్స్ లో అదొక రష్యన్ ప్రోటాన్ ఎం రాకెట్ అని.. మూడు గ్లోనస్ నావిగేషన్ శాటిలైట్స్ ను తీసుకుని వెళుతూ ఉండగా ఆ ప్రయోగం విఫలమైంది. కజకిస్థాన్ లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ వద్ద ఈ ప్రయోగం చేయగా క్షణాల్లో అది నేలకు రాలిపోయింది. రష్యన్ ప్రోటాన్ ఎం క్యారియర్ రాకెట్ విఫలమవడం అది రెండోసారి. రష్యాకు చెందిన గ్లోనాస్ పొజిషనింగ్ సిస్టమ్ ను అంతరిక్షం లోకి తీసుకుని వెళ్ళడానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది.

3-3.2 టన్నుల బరువును ప్రోటాన్-ఎం లాంఛ్ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి తీసుకుని వెళ్లగలదు. 5.5 టన్నుల ను కూడా జియోస్టేషనరీ ఆర్బిట్ లోకి తీసుకుని వెళ్లగలదు. 22 టన్నులను లో-ఆర్బిట్ లోకి తీసుకుని వెళ్లగలదు. మొదటి ప్రోటాన్ రాకెట్ ను 1965 లోనే లాంఛ్ చేశారు. అప్పటి లాంఛ్ సిస్టమ్ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. స్పేస్ ఫ్లైట్ విభాగంలో హెవీ బూస్టర్ గా గొప్ప పేరును సంపాదించుకుంది.

http://www.jetflightpro.com/2013/07/russian-proton-m-rocket-explodes-on.html

https://www.eteknix.com/russian-proton-m-satellite-rocket-crashes-toxic-fuel-everywhere/amp/

website space.com కథనం ప్రకారం డిసెంబర్ 2010 నాటి నుండి డిసెంబర్ 2012 నాటికి అయిదు ప్రోటాన్ రాకెట్ లాంచింగ్ లు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. టెలికమ్యూనికేషన్స్ శాటిలైట్ ను ప్రోటాన్ బూస్టర్ సహాయంతో లాంచ్ చేసినప్పుడు ఈ ఫెయిల్యూర్లు జరిగాయని చెబుతున్నారు.

Martin Vit కు చెందిన యూట్యూబ్ ఛానల్ మే 2014న “Proton M rocket explosion July 2 2013 slow motion” వీడియోను అప్లోడ్ చేశారు. జులై 2, 2013న ఆ రాకెట్ ప్రయోగం విఫలమైందని.. దాన్ని స్లో మోషన్ లో చూడొచ్చు అని వీడియోలో చెబుతున్నారు.

రష్యాకు చెందిన రాకెట్ లాంచ్ విఫలమమైన వీడియోను భారత్ మిసైల్ లాంచ్ చేయడంలో విఫలమైందని సోషల్ మీడియాలో పోస్టు వైరల్ చేస్తున్నదంతా 'పచ్చి అబద్ధం'.

Next Story