Fact Check: నిజమెంత: రైలు పట్టాలు, మనుషులను లాగుతున్న గుర్రం.. ఇంతకూ ఎక్కడ ఉంది..?

By సుభాష్  Published on  18 July 2020 3:37 AM GMT
Fact Check: నిజమెంత: రైలు పట్టాలు, మనుషులను లాగుతున్న గుర్రం.. ఇంతకూ ఎక్కడ ఉంది..?

చిన్న ప్యాసెంజర్ ట్రాలీ అందులో కొందరు మనుషులు.. రైల్వే పట్టాలపై లాక్కుంటూ వెళుతూ ఉన్న వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సదుపాయం ఎక్కడ ఉందా అని అందరూ ఆరా తీస్తున్నారు.



రైల్వే ట్రాక్ మీద గుర్రం ట్రాలీని లాక్కుని వెళుతున్న వీడియో పాకిస్థాన్ కు చెందినది. సర్ గంగారామ్ ఆసుపత్రి ఫేమ్ సర్ గంగారామ్ అగర్వాల్ ఈ రైల్వే లైన్ ను నిర్మించారని చెబుతున్నారు. పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.



నిజ నిర్ధారణ:

ఈ వీడియోలను, ఫోటోలను పోస్టు చేస్తున్న కొందరు ఇంతకూ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది.. దాని వెనుక ఉన్న ఘటన ఏంటి అన్నది తెలుసుకోవాలని అనుకుంటున్న వారి కోసం ఈ స్పెషల్ స్టోరీ..!

‘Horse Train Pakistan’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించగా యుట్యూబ్ లో పలు వీడియోలు లభించాయి. 'వింతైన గుర్రం ట్రైన్' అంటూ చాలా సమాచారం లభించింది.

లాహోర్ కు దగ్గరలో ఉన్న మంగ్టన్వల్లా ప్రాంతంలో గంగారామ్ ఏప్రిల్ 13, 1851న జన్మించాడు. ఆ సమయంలో భారతదేశం లో ఆంగ్లేయుల పాలన ఉండేది. థాంప్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ పూర్తీ చేశాడు గంగారామ్.

T1

బ్రిటీష్ ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉన్న సమయంలో ఎన్నో చారిత్రాత్మకమైన ప్రాజెక్ట్ లకు పని చేశాడు. రిటైర్మెంట్ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో 85000 ఎకరాలను లీజుకు తీసుకున్న గంగారామ్ తనకు తెలిసిన వ్యవసాయరంగానికి సంబంధించిన టెక్నీక్ ల ద్వారా ఆ ప్రాంతాన్ని పంటలు పండించడానికి అనువుగా మార్చేశాడు. గంగాపూర్ ఎస్టేట్ గా అప్పటి నుండి పిలవబడుతోంది.

T2

వ్యవసాయ పనుల కోసం ఏవైనా సరుకులు, వస్తువులు తీసుకుని రావడానికి, మనుషులను పిలుచుకుని రావడానికి ఆయన న్యారో గేజ్ రైల్వే ట్రాక్ ను 1898లో ఏర్పాటు చేశాడు. ఓ ట్రాలీని ఉంచి దాన్ని ఓ గుర్రంతో లాగించే వాళ్లు.

సర్ గంగారామ్ 1927లో మరణించిన తర్వాత, ఆ ట్రాక్, హార్స్ ట్రైన్ బాగోగులు ఎస్టేట్ లో పని చేసే వాళ్లు చూసుకుంటూ ఉండేవారు. 1998 వరకూ ఈ ట్రాక్ మీద ప్రయాణాలు సాగాయి. రెండు ట్రాలీలను ఏర్పాటు చేసి.. ఒక వైపు నుండి మరో వైపుకు గుర్రాలతో లాక్కుంటూ వచ్చే వారు. మధ్యలో ప్యాసెంజర్లను మార్చుకుంటూ ఉండే వారు.

T3

ఈ హార్స్ ట్రైన్ ఆగిపోవడంతో స్థానికులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరారు. 2010లో ప్రభుత్వం ఈ అరుదైన ప్రాజెక్ట్ కు పచ్చ జెండా ఊపింది.

T4

T5

మరో నాలుగేళ్ల పాటూ చాలా మంది ప్రయాణీకులు ఈ హార్స్ ట్రామ్ ద్వారా బాగానే ప్రయాణాలు చేశారు. కానీ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో ఘోరా ట్రైన్ ను 2014లో నిలిపివేశారు.

T6

ఈ అరుదైన ట్రైన్ సవారీకి సంబంధించిన ఫోటోలు, సమాచారాం కోసం ఈ లింక్ లను క్లిక్ చేయండి:

https://www.meemainseen.com/2014/11/gangapur/

https://www.irfca.org/gallery/Foreign/HorseTramPakistan/

Next Story