మహారాష్ట్ర ముఖ్య మంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం
By సత్య ప్రియ Published on 23 Nov 2019 9:35 AM IST
మహారాష్ట్ర లో రాజకీయాలు అనుహ్యంగా మారాయి. మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ ఫడ్నవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీ కి చెందిన అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.
అందరి అంచనాలూ తలకిందలు చేస్తూ బిజేపి - ఎన్సీపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాత్రికి రాత్రే మారిన ఈ పరిణామాలు శివసేన కు భారి షాక్ గా నిలిచాయి.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ కి, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కి, ప్రధాని మోడి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కి వారు కృషి చేస్తారని భావిస్తున్నారని ఆయన అన్నారు.
Next Story