దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనవడు అంటూ ఓ బాలుడు పాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, బాలుడు బాలసుబ్రహ్మణ్యం పాడిన 'మలరే మౌనమా' పాడటం వినవచ్చు. బాలసుబ్రహ్మణ్యం పాడిన ఒరిజినల్ పాటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌లను తీసుకుని. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. YouTubeలో అదే వీడియో మా బృందానికి కనిపించింది. "Malare Mouname – Beautiful Singing by Adithya Suresh" అని వీడియోకు పేరు పెట్టారు. 19 జూన్ 2020న అప్‌లోడ్ చేయబడింది. పాట పాడిన పిల్లాడి పేరు ఆదిత్య సురేష్ అని మా బృందం కనుగొంది.
మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. ఆదిత్య సురేష్ ఫేస్‌బుక్ పేజీలో అదే వీడియోని కనుగొన్నాము. కామెంట్ సెక్షన్‌లో, మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనవడు కదా అని అడగగా.. ఆదిత్య సురేష్ అది నిజం కాదని, ఫేక్ న్యూస్ అని ధృవీకరించాడు.
ఆదిత్య సురేష్ కేరళలోని కొల్లంకు చెందిన ప్రముఖ గాయకుడు, బ్రిటిల్ బోన్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడికి పాడటం అంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే కేరళ, దేశంలోని ఇతర ప్రాంతాలలో అనేక సంగీత ప్రదర్శనలు చేశాడు. సినిమాల్లో పాటలు కూడా పాడాడు.
ఆదిత్య సురేష్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో చూడచ్చు. లెజెండరీ సింగర్ బాలు కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను కూడా మేము పరిశీలించాము.
ఆదిత్య సురేష్ పాడిన వీడియోను.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనవడు అని తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారని మేము గుర్తించాము.