ఎయిమ్స్ వ్యవస్థాపకురాలు రాజ్‌కుమారి అమృత్ కౌర్ ఫోటో ఇదంటూ సామాజిక మాధ్యమాలో ఫోటోలను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఫోటో కింద "ఆమె ఎయిమ్స్ వ్యవస్థాపకురాలు రాక్ కుమారి అమృత్ కౌర్. ఆమె భారతదేశపు మొదటి ఆరోగ్య మంత్రి మరియు WHO యొక్క పాలకమండలికి అధిపతి అయిన మొదటి ఆసియా వాసి. చాలా మంది భారతీయులు ఆమెకు తెలియదు. ఆమె ఒక హీరో, వారు భారతీయుల స్వేచ్ఛ గురించి మంచి జీవితం కోసం పోరాడారు " అంటూ ఉంది.
ఆర్కైవ్ చేసిన ఫేస్ బుక్ పోస్టును చూడొచ్చు
ఇదే ఫోటో ఇతర వెబ్ సైట్లలో కూడా చూడొచ్చు
https://neuronerdz.com/the-princess-who-built-aiims-rajkumari-amrit-kaur/
https://aishwaryasandeep.com/2021/01/27/iw13/
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోలో ఉన్నది రాజ్‌కుమారి అమృత్ కౌర్ కాదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్‌మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆ ఫోటోలో ఉన్నది రచయిత అవంతిక మెహతా. అవంతిక మెహతా 'లేడీస్ కంపార్ట్‌మెంట్' ను రాశారు. ఛాయాచిత్రంలో ఉన్నది రాజ్‌కుమారి అమృత్ కౌర్ కాదని.. తానేనని అవంతిక మెహతా ట్వీట్ చేసింది. తన ఫోటోను రాజ్ కుమారి అమృత్ కౌర్ అంటూ ప్రచారం చేస్తున్నారని అవంతిక జూన్ 18 న ట్వీట్ చేసింది.
ఐదేళ్ల క్రితం స్నేహితుడి వెబ్‌సైట్ కోసం తాను చేసిన షూట్‌లో ఈ ఫోటో కూడా ఒకటని ఆమె తెలిపింది. ఈ వైరల్ ఫోటోల్లో ఎటువంటి నిజం లేదని.. వాటిని తీసివేయాలని ఆమె కోరింది.
న్యూస్ మీటర్ రాజ్‌కుమారి అమృత్ కౌర్‌పై కథనాలను శోధించింది. యువరాణి యొక్క అసలు ఫోటోలతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ఒక కథనాన్ని కనుగొన్నాము. వ్యాసానికి సంబంధించిన లింక్‌ను ఇక్కడ చూడొచ్చు. ఈ కథనంలో రాజ్ కుమారి అమృత్ కౌర్ చరిత్ర, ఎయిమ్స్ విజయవంతం చేయడంలో ఆమె పాత్ర గురించి వివరించారు.
వైరల్ చిత్రాన్ని అవంతిక మెహతా ఫోటోలతో పోల్చాము. రెండు చిత్రాల మధ్య అనేక సారూప్యతలను కనుగొన్నాము. మీరు కూడా ఈ ఫోటోలలో తేడాలను గమనించవచ్చు.
కాబట్టి వైరల్ అవుతున్న ఫోటోలలో ఎటువంటి నిజం లేదు. వైరల్ చిత్రం రాజ్‌కుమారి అమృత్ కౌర్ కాదు, అవంతిక మెహతాది. స్వయంగా అవంతిక చెప్పినప్పటికీ పలువురు ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.