భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ మహిళకు నమస్కారం పెడుతూ ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఈ ఫోటోలో ఉన్న మహిళ ప్రీతి అదానీ అని చెబుతూ ఉన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, సంపన్నుడైన గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ అని.. ఆమెకు భారతప్రధాని నరేంద్ర మోదీ వంగి మరీ దండాలు పెడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోలో నరేంద్ర మోదీ నమస్కారాలు పెడుతోంది గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీకి కాదు. ఢిల్లీ బేస్ ఎన్.జి.ఓ. దివ్యజ్యోతి కల్చర్ ఆర్గనైజేషన్ అండ్ వెల్ ఫేర్ సోసిటీ ఛీఫ్ ఫంక్షనల్ ఆఫీసర్ అయిన 'దీపిక మోండుల్'.
వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2018 లో తీసిన ఫోటో అని తెలుస్తోంది. One India Hindi లో కూడా ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు అంటూ అప్లోడ్ చేయడం జరిగింది. Amar Ujala, Divya Marathi మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు మీడియా సంస్థలు తెలిపాయి.
ఈ కింది ఫోటోలో వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళకు.. ప్రీతి అదానీకి ఉన్న తేడాలను గమనించవచ్చు.
దీన్ని బట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టంగా తెలుస్తోంది. గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీకి మోదీ నమస్కారం చేయడం లేదు.