FactCheck : ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మెస్సీ హత్తుకున్న మహిళ తల్లి కాదు

Woman Messi hugged after World Cup final is Argentina team chef, not his mom. అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన తల్లిని కౌగిలించుకున్నట్లు చూపించిన వీడియోను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Dec 2022 8:08 PM IST
FactCheck : ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మెస్సీ హత్తుకున్న మహిళ తల్లి కాదు

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ తన తల్లిని కౌగిలించుకున్నట్లు చూపించిన వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. డిసెంబర్ 18న ఖతార్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి, 2022 ఫిఫా ప్రపంచ కప్‌ను అర్జెంటీనా గెలుచుకున్న తర్వాత ఈ వీడియో వైరల్ అవుతోంది.


"A warm hug between Messi and his mother after Argentina won the FIFA WorldCup Qatar 2022 Final." అనే శీర్షికతో ఒక Facebook పేజీ వీడియోను షేర్ చేసింది.

పలువురు ట్విట్టర్ యూజర్లు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు.

NDTV, హిందూస్తాన్ టైమ్స్ వంటి మీడియా సంస్థలు కూడా ఈ వీడియో స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నాయి. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మెస్సీ తన తల్లితో ఉన్న భావోద్వేగ క్షణాలు ఇవని పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ :

NewsMeter ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. మెస్సీ కౌగిలించుకున్న మహిళ అతని తల్లి కాదని కనుగొంది. ది సన్ ప్రచురించిన కథనం ప్రకారం, ప్రపంచ కప్ విజయం తర్వాత మెస్సీని కౌగిలించుకుని ఏడుస్తున్న మహిళ ఆంటోనియా ఫారియాస్ - అర్జెంటీనా జాతీయ జట్టు చెఫ్. అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు ఫారియాస్ వండి పెడుతూ ఉంటుంది.


లాస్ ఆండీస్ రాసిన స్పానిష్ కథనాన్ని కూడా మేము చూశాము, ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత, మెస్సీ తన తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపుతున్నట్లు సోషల్ మీడియా వినియోగదారులతో తప్పుగా వైరల్ అయిందని తెలిపారు.

క్లిప్‌లోని మహిళ గత పదేళ్లుగా అర్జెంటీనా జాతీయ జట్టుకు చెఫ్‌గా ఉన్న ఆంటోనియా ఫారియాస్ అని కథనం ద్వారా తెలిసింది. ఆమె ప్రతిచో టా జట్టుతో పాటుగా ఉంటుంది. ఆటగాళ్లతో మంచి అనుబంధాన్ని పెంచుకుంది.

గెట్టి ఇమేజెస్ ప్రచురించిన ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలను మేము చూశాం. అందులో మెస్సీ తల్లి, ఆమె భార్య చిత్రాన్ని కూడా చూశాము. "Celia Maria Cuccittini, mother of Lionel Messi and his wife Antonella Roccuzzo following the FIFA World Cup Qatar 2022 Final match between Argentina and France at Lusail Stadium on December 18, 2022, in Lusail City, Qatar." అంటూ డిస్క్రిప్షన్ లో ఉంది.

వైరల్ క్లిప్‌లోని మహిళ అర్జెంటీనా జట్టు జెర్సీని ధరించింది.


వైరల్ క్లిప్‌లో మెస్సీతో భావోద్వేగ క్షణాన్ని పంచుకున్న మహిళ అర్జెంటీనా జాతీయ జట్టుకు చెఫ్ అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, మీడియా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారుల వాదన తప్పు.


Claim Review:ప్రపంచ కప్ గెలిచిన తర్వాత మెస్సీ హత్తుకున్న మహిళ తల్లి కాదు
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story