ఓ మహిళా కానిస్టేబుల్‌తో వెళ్తున్న ఓ మహిళ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రేపిస్టులను చంపినందుకు ఆమెను అరెస్టు చేసినట్లు వినియోగదారులు పేర్కొన్నారు.

నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. "ఈ మహిళ తనపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను చంపింది. ఆమె చేసింది ఖచ్చితంగా సరైనదని నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయం ఏమిటి?" అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న మహిళ రేపిస్టులను చంపలేదు. తనకు కాబోయే భర్తను చంపించింది.

అత్యాచారం చేసిన వారిని చంపినందున ఆ మహిళను అరెస్టు చేయలేదు. కాబోయే భర్తను హత్య చేసినందుకు ఆమెకు శిక్ష పడింది.

NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది. డెక్కన్ హెరాల్డ్ జూలై 2010 నుండి ప్రచురించిన ఒక కథనాన్ని కనుగొంది. ఒకే మహిళ యొక్క ఫోటో పలు సైడ్స్ నుండి ఫోటోలు తీశారు.


నివేదిక ప్రకారం, వైరల్ ఇమేజ్‌లో ఉన్న మహిళ నిశ్చితార్థం జరిగిన నాలుగు రోజుల తర్వాత తన కాబోయే భర్తను చంపడానికి కుట్ర పన్నింది. డిసెంబర్ 2003లో శుభ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్, అతని ఇద్దరు స్నేహితుల సహాయంతో డోమ్లూర్-కోరమంగళ రింగ్ రోడ్డులోని ఎయిర్ వ్యూపాయింట్ వద్ద తన కాబోయే భర్తను హత్య చేసింది.

ఇదే విషయాన్ని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, బెంగుళూరు మిర్రర్, ది హిందూ కూడా నివేదించాయి. ఈ సంఘటన డిసెంబర్ 2003లో బెంగుళూరులోని రింగ్ రోడ్‌లోని ఎయిర్ వ్యూ పాయింట్ వద్ద ఉన్నప్పుడు జరిగింది. బాధితుడి తలకు ఎడమవైపున బలమైన దెబ్బ తగిలి కుప్పకూలిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను చనిపోయినట్లు ప్రకటించారు. జనవరి 2004లో పోలీసులు ఆమెకు కాబోయే భర్త హత్యకు పథకం పన్నారని ఆరోపిస్తూ శుభ, ఆమె ప్రియుడు మరియు అతని సహచరులను అరెస్టు చేశారు. మే 2010లో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆమెను హత్య చేసినందుకు దోషిగా నిర్ధారించింది. 2014లో శుభకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


వైరల్ ఇమేజ్‌లో కనిపించే విధంగా మహిళ చిత్రంతో మొత్తం ప్రక్రియల కాలక్రమాన్ని "ది హిందూ" ప్రచురించింది.

కాబట్టి వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న యువతి.. తనపై అత్యాచారం చేసిన వారిని చంపలేదు. తనకు కాబోయే భర్తను చంపించిందనే అభియోగాలు మోపబడ్డాయి.


Claim Review :   వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళ రేపిస్టులను చంపేసిందా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story