FactCheck : జీ20 సదస్సుకు భారత ప్రధాని మోదీ రావద్దని మహిళ ప్లకార్డును పట్టుకుని నిరసన తెలియజేసిందా..?

Woman holding 'Go Back Modi' placard is morphed. ఇటీవల ఇండోనేషియాలోని బాలిలో జీ20 సదస్సును నిర్వహించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Nov 2022 2:05 PM GMT
FactCheck : జీ20 సదస్సుకు భారత ప్రధాని మోదీ రావద్దని మహిళ ప్లకార్డును పట్టుకుని నిరసన తెలియజేసిందా..?

ఇటీవల ఇండోనేషియాలోని బాలిలో జీ20 సదస్సును నిర్వహించారు.

"గో బ్యాక్ మోడీ" అని రాసి ఉన్న ప్లకార్డ్ పట్టుకుని ఉన్న మహిళ ఫోటోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. బాలిలో G20 శిఖరాగ్ర సమావేశం జరిగిన సమయం నుండి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Bali, Indonesia Nov, 2022https://t.co/TCoXcGKJz6 pic.twitter.com/QjAKflUR1m

— S🍁oirse (@SaoirseAF) November 16, 2022 ">ఒక ట్విట్టర్ వినియోగదారు ఫోటోను షేర్ చేస్తూ.. "బాలి, ఇండోనేషియా నవంబర్ 2022" అని రాశారు, ఆ ప్లకార్డు G20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తున్నారని చెబుతూ
షేర్
చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

NewsMeter బృందం ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ నిర్వహించింది. దానిని రచయిత, కాలమిస్ట్ వజాహత్ అలీ 1 జూలై 2022న పోస్ట్ చేసారు. అయితే, ప్లకార్డ్‌లోని టెక్స్ట్ G20 సమ్మిట్‌లో PM మోదీని బహిష్కరించాలని పిలుపునివ్వలేదు.

అందులో "Democrats and Independents must unite to vote out Republicans. Vote blue this November." అని ఉంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏమీ లేదని మేము గుర్తించాం.

ప్లకార్డు పట్టుకుని ఉన్న మహిళ ఫోటోను అలీ పోస్ట్ చేసి "This lady has been holding this sign at the middle of the intersection, stone cold, not a word uttered. I still think the country is underestimating the anger of women and Gen Z. They won't take this sitting down. They won't go back. ఇలా రాశారు.


వైరల్ ఫోటోలోని ప్లకార్డు మార్ఫింగ్ చేసినట్లు అలీ పోస్ట్ ద్వారా స్పష్టమైంది. అందువల్ల, వైరల్ ఫోటో ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.

ఫోటో తీయబడిన ప్రదేశం, ప్లకార్డు పట్టుకున్న మహిళ వెనుక ఉన్న ఉద్దేశ్యం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి NewsMeter వజాహత్ అలీని కూడా సంప్రదించింది. ప్రతిస్పందించినప్పుడు కథనాన్ని అప్డేట్ చేస్తాము.


Claim Review:జీ20 సదస్సుకు భారత ప్రధాని మోదీ రావద్దని మహిళ ప్లకార్డును పట్టుకుని నిరసన తెలియజేసిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story