'ప్రధాన్ మంత్రి నారీ శక్తి పథకం' కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మహిళలకు రూ. 25 లక్షలు అందించనున్నట్లు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. ఎటువంటి గ్యారెంటీ, వడ్డీ లేకుండా SBI డబ్బును ఇస్తుందని పేర్కొంటూ వినియోగదారులు మెసేజ్ ను ప్రసారం చేస్తారు. వైరల్ సందేశం చివరిలో YouTube లింక్ కూడా జోడించబడింది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న మెసేజీ ప్రజలను తప్పుద్రోవ పట్టించేది.
NewsMeter వైరల్ లింక్‌పై క్లిక్ చేయగా.. సెప్టెంబర్ 13, 2021న అప్‌లోడ్ చేయబడిన YouTube ఛానెల్ 'Sarkari Guru' ఓపెన్ అయింది. ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కనిపించింది.
వీడియోలో, "ప్రధానమంత్రి నారీ శక్తికరణ్ యోజన 2021, మీకు రూ. 25 లక్షలు అందుతాయి" అని చెప్పడం గమనించవచ్చు. వీడియో 2021 నాటిదని మేము గుర్తించాము. వైరల్ టెక్స్ట్ ను చూస్తే సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అటువంటి టెక్స్ట్ ఫార్మాట్‌లో లింక్ చేయబడదని గుర్తించాము. 'सिक्योरिटी' వంటి పదాన్ని 'सिम्योरिटी' అంటూ రాసి ఉండడాన్ని గమనించాం.
వైరల్ మెసేజీలోని పథకం కింద అటువంటి ప్రయోజనం లేదని మేము గుర్తించాము. ప్రధాన మంత్రి నారీ శక్తి కేంద్ర యోజన కింద కొన్ని ఇతర పథకాలు ఉన్నాయి.
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ప్రధాన్ మంత్రి నారీ శక్తి కేంద్ర యోజన కింద ఉన్న పథకాలలో బేటీ బచావో బేటీ పఢావో స్కీమ్, వన్ స్టాప్ సెంటర్ స్కీమ్, ఉమెన్ హెల్ప్‌లైన్ స్కీమ్, ఉజ్జవాలా: అక్రమ రవాణా మరియు రెస్క్యూ, పునరావాసం నివారణకు సమగ్ర పథకం ఉన్నాయి. ట్రాఫికింగ్ , లైంగిక దోపిడీ బాధితులను ఆదుకోవడం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్, మంత్రిత్వ శాఖ ఉజ్వల పథకం కింద కొత్త ప్రాజెక్ట్‌లను ఆమోదించింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌లను కొనసాగిస్తున్నారు.
https://wcd.nic.in/hi/schemes-listing/2405
వైరల్ దావాకు సంబంధించిన సమాచారం ఏదీ మాకు కనిపించలేదు.
మేము ఫిబ్రవరి 22, 2022న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ చేసిన ట్వీట్‌ను కనుగొన్నాము. వారు YouTube వీడియో అందించిన సమాచారాన్ని తిరస్కరించారు. 'కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదు' అని పేర్కొన్నారు.
SBI ఈ పథకం కింద మహిళలకు మొత్తాన్ని అందజేస్తుందా.. లేదా అని కూడా మేము పరిశీలించాము. మా వద్ద ఎలాంటి నివేదికలు కానీ సమాచారం కానీ లభించలేదు.
కాబట్టి వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించేది. ప్రధాన మంత్రి నారీ శక్తి యోజన కింద ఎస్‌బిఐ మహిళలకు రూ.25 లక్షలు ఋణం అందించడం లేదు. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం 'ప్రధాన మంత్రి నారీ శక్తికరణ్ యోజన' పేరుతో ఒక పథకం ఉంది.