హైదరాబాద్: త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇల్లు, దుకాణాల అద్దెలపై 12% జీఎస్టీని ప్రవేశపెట్టబోతున్నారని తమిళంలో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ప్రకటనను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆపాదించారు.
నిర్మలా సీతారామన్ ఉన్న ఫోటోను పోస్టు చేసి.. తమిళంలో ఉన్న పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వాదనను కొట్టిపారేసింది. ఈ వార్త నకిలీదని పేర్కొంది. త్వరలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ట్వీట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ ట్వీట్‌ను నిర్మలా సీతారామన్ అధికారిక ట్విట్టర్ ఖాతా రీట్వీట్ కూడా చేసింది.
ప్రస్తుతం, అద్దెపై 18% జీఎస్టీ చెల్లిస్తూ ఉన్నారు. జీఎస్టీ వాణిజ్యపరమైన ఆస్తికి అద్దె మాత్రమే విధించబడుతుంది. నివాసం ఉండే ఇళ్లకు ఎటువంటి జీఎస్టీలు లేవు. నోటిఫికేషన్ నం. 12/2017 ప్రకారం, నివాస గృహాలను మినహాయింపు ఉంది.
వాణిజ్యపరమైన ఆస్తిని వాణిజ్య ఉపయోగం కోసం అద్దెకు తీసుకుంటే, అప్పుడు GST విధించబడుతుంది, కానీ నివాస ప్రాపర్టీని నివాస ప్రయోజనాల కోసం అద్దెకు తీసుకుంటే అది GST నుండి మినహాయించబడుతుంది. అయితే, నివాస ప్రాపర్టీని వ్యాపార అవసరాల కోసం అద్దెకు తీసుకున్నట్లయితే, అప్పుడు GST వర్తిస్తుంది. (In other words, if a commercial property is rented for commercial use, then GST is levied but if a residential property is being rented for residential purposes, it is exempted from GST. However, if the residential property is rented for business use, then GST will be applicable)
ఇప్పటి వరకు, ఇళ్లు మరియు దుకాణాల అద్దెపై 12% GST విధించబడుతుందని ఎటువంటి నిర్ధారణ లేదు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాలేదు. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.