Fact Check : వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ చనిపోయాడా..?

West Indies cricketer Kieron Pollard is not dead. పలువురు ప్రముఖులు చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ఇటీవలి కాలం చాలా కామన్ అయిపోయింది.వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ చనిపోయాడా

By Medi Samrat  Published on  2 Feb 2021 5:58 AM GMT
West Indies cricketer Kieron Pollard is not dead

పలువురు ప్రముఖులు చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ఇటీవలి కాలంలో చాలా కామన్ అయిపోయింది. గతంలో కూడా పలువురు ప్రముఖులు చనిపోయారంటూ వార్తలు వైరల్ అవ్వడం.. ఆ తర్వాత వారు బ్రతికే ఉన్నారంటూ నిజం తెలియడం చాలా సార్లు జరిగింది.

వెస్టిండీస్ ఆటగాడు, ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ చనిపోయాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ వస్తున్నాయి. పోలార్డ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ పోస్టులు పెట్టారు. అందుకు సంబంధించిన చాలా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు షేర్ చేస్తూ ఉన్నారు. కొన్ని వెబ్సైట్స్ లో పోలార్డ్ చనిపోయాడంటూ కథనాలను ప్రచురించడం కూడా జరిగింది.

newshut37.com అనే వెబ్సైట్ లో "We mourn with the family of Kieron Pollard, we understand how disheartening they could be right now, so we are sending our thoughts and prayers to the affected ones. Kieron Pollard has left friends, family and loved ones heart-broken as the news surrounding the death of Kieron Pollard was announced. Information about the death of the deceased was released across social media on January 27, 2021." అంటూ కథనాన్ని ప్రచురించారు. పోలార్డ్ మరణానికి చాలా చింతిస్తున్నామని అందులో చెప్పుకొచ్చారు. శవపేటిక మీద కొందరు ఏడుస్తూ ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.


నిజ నిర్ధారణ:

విండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ చనిపోయాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

పోలార్డ్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడంటూ పోస్టులు వైరల్ అవుతున్న సమయంలో పోలార్డ్ 'అబుదాబీ టీ10 లీగ్' లో ఆడుతూ కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఏడాది డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్ కు పోలార్డ్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు.

https://www.news18.com/cricketnext/news/kieron-pollard-latest-to-fall-victim-to-death-rumours-thanks-to-viral-fake-news-video-3363737.html

India.com కథనం ప్రకారం పోలార్డ్ చనిపోయాడంటూ వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని తేల్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే చనిపోయాడంటూ తప్పుడు వార్తను ప్రచురించారు. 33 సంవత్సరాల పోలార్డ్ కు ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు. అతడు హ్యాపీగా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు.

https://www.republicworld.com/sports-news/cricket-news/fact-check-is-kieron-pollard-dead-after-youtube-car-accident-video-goes-viral.html

https://www.dnaindia.com/cricket/report-kieron-pollard-dead-this-is-the-truth-2871722

విండీస్ ఆటగాడు పోలార్డ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ చనిపోయాడా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Youtube Channels
Claim Fact Check:False
Next Story