వేదికపై నుంచి ఒకరిని కిందికి దిగమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అని, ఆయనను వేదికపై నుంచి కిందకు దిగమని యోగి ఆదిత్యనాథ్ కోరుతున్నారని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు
"ఇది కేశవ్ ప్రసాద్ మౌర్య (యూపీ డిప్యూటీ సీఎం)కు ఇస్తున్న గౌరవం" అని వీడియోను పలువురు షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్ మీటర్ వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. KNewsIndia రెసిడెంట్ ఎడిటర్ మరియు బ్రేకింగ్ టుడే స్థాపకుడు మనీష్ పాండే చేసిన ట్వీట్ కనిపించింది. ఆయన కూడా అలాంటి వీడియోనే షేర్ చేశారు. "కొన్నిసార్లు ఫూల్‌ను చేసే వ్యవహారంలో అవమానం జరుగుతుంది. #గోరఖ్‌పూర్‌లో సాన్నిహిత్యం చూపినందుకు #బిజెపి నాయకుడు విభ్రత్ చంద్ కౌశిక్‌ను బహిరంగంగా మందలించారు" అని ఆయన ట్వీట్ చేశారు.
'The Lucknow Express' అనే వెబ్సైట్ లో "Sometimes when the timing is wrong, one can be called out by the CM," అంటూ హెడ్ లైన్ ఉన్న కథనం కనిపించింది.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న యోగి ఆదిత్యనాథ్ పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీకి చెందిన ఓ నాయకుడిని ఆయన మందలిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి కార్యక్రమం మధ్యలో బీజేపీ నేత డాక్టర్ విభ్రత్ చంద్ కౌశిక్ సీఎం యోగికి నమస్కరించారు. కోపోద్రిక్తుడైన సీఎం అతడిని మందలించి వెళ్లిపోవాలన్నారు.
ఫ్యాక్ట్ చెక్ బృందం నవంబర్ 30, 2021న 'హిందూస్థాన్ లైవ్' యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోను కనుగొంది. ఈ వీడియో సహాయంతో, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వీడియోలో లేరని బృందం కనుగొంది. వీడియోలోని వ్యక్తి రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ విభ్రత్ చంద్ కౌశిక్ అని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదు. వీడియోలో ఉన్న వ్యక్తి కేశవ్ ప్రసాద్ మౌర్య కాదు, రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ విభ్రత్ చంద్ కౌశిక్.