ఓ ఫుట్ బాల్ టీమ్ కు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
1948 లండన్ ఒలింపిక్స్ కు వెళ్లిన భారత ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్లకు కనీసం షూలు కూడా లేవని.. అందుకు అప్పటి నెహ్రూ ప్రభుత్వమే కారణం అంటూ పోస్టులను పెడుతూ ఉన్నారు.
"స్వాతంత్య్రం పొందిన ఇండియా ఫుట్‌బాల్ టీమ్‌లో బూట్లు కొనడానికి తగినంత డబ్బు లేదు. కొంతమంది ఆటగాళ్లు సాక్స్‌లు ధరించారు, ఇంకొందరు చెప్పులు లేకుండా ఆడారు. నెహ్రూ మాత్రం బట్టలు డ్రై-క్లీన్ చేయడానికి పారిస్‌కు వెళ్లిన సమయం ఇది" అని పోస్టులు పెట్టారు.
సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్‌మీటర్ కీవర్డ్ సెర్చ్ చేయగా.. ఇది జూలై 31, 2018 న ఫిఫా యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ లోని ట్వీట్ కనిపించింది. 1948 లో #OnThisDay భారతదేశం వారి మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ని @Olympics లో పోటీ చేసింది, భారత జట్టు, చాలా వరకు ఎవరు చెప్పులు లేకుండా ఆడారు. ఫ్రాన్స్ 2-1 తేడాతో భారత్ ను ఓడించింది.
దీనిపై మే 17, 2014 న నివేదికను ది హిందూ యూనిట్ 'స్పోర్ట్‌స్టార్' ప్రచురించింది. అందులో అప్పటి భారత ఆటగాళ్లు కావాలనే షూలు కూడా లేకుండా మ్యాచ్ ఆడారు. పాదరక్షలు లేకుండా వారి ప్రతిభను చూపించారు. భారత ఫుట్‌బాల్ క్రీడాకారులు షూలు, చెప్పులు లేకుండా ఆడేందుకు ఇష్టపడ్డారు. 1948 లండన్ ఒలింపిక్స్ ప్రారంభ రౌండ్‌లో ఫ్రాన్స్ జట్టుతో భారతదేశం ఓడిపోయినప్పటికీ, బ్రిటిష్ మీడియా నుండి అద్భుతమైన ప్రశంసలు భారత ఆటగాళ్లు పొందారు. షూలు లేకుండా అసాధారణ ఆటతీరు కనబరిచారని ప్రశంసించారు.
ఈ లింక్ లో కూడా భారత ఫుట్ బాల్ జట్టుకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు.
https://www.sportskeeda.com/sports/the-history-of-indian-football-team-in-fifa-world-cup-qualifiers
పలు మీడియా సంస్థలు భారత ఫుట్ బాల్ జట్టు స్వాతంత్య్రం పొందిన తర్వాత ఆడిన మ్యాచ్ గురించి కథనాలను ప్రచారం చేశాయి.
1948 లండన్ ఒలింపిక్స్ లో భారత ఫుట్ బాల్ జట్టు లోని 11 మంది ఆటగాళ్లలో 8 మంది ఎటువంటి పాద రక్షలు లేకుండానే మ్యాచ్ ను ఆడారు. అయినా కూడా భారత జట్టు ఫ్రాన్స్ కు గట్టి పోటీనే ఇచ్చింది. వాళ్లు తమ ఇష్టంతో మాత్రమే షూలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్ ను ఆడారు. అంతేకానీ భారత ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదు అన్నది నిజం కాదు.
"Well, you see, we play football in India, whereas you play bootball!" అంటూ అప్పటి భారత జట్టు కెప్టెన్ అన్న మాటలు అప్పటి పత్రికల్లో హెడ్ లైన్స్ గా వచ్చాయి. భారత్ లో ఫుట్ బాల్ ఆడతామని.. ఇక్కడ బూట్ బాల్ ఆడుతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి.
కాబట్టి వైరల్ అవుతున్న కథనాల్లో 'ఎటువంటి నిజం లేదు'. 1948 ఒలింపిక్స్ లో భారత ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్లు కావాలనే పాదరక్షలు లేకుండా ఆడారు. భారత ప్రభుత్వం ఎటువంటి మద్దతు ఇవ్వలేదు అనే కథనాల్లో నిజం లేదు.