FactCheck : రైతు బంధు కొత్త రూల్స్ అంటూ వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదు
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి పలు మార్పులను చేస్తున్నట్లు తెలుగులో ఒక WhatsApp సందేశం సోషల్ మీడియాలో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Dec 2023 7:45 PM ISTతెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి పలు మార్పులను చేస్తున్నట్లు తెలుగులో ఒక WhatsApp సందేశం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
తెలుగులో ఉన్న మెసేజీ వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతూ ఉంది.
"రైతు బంధు కొత్త రూల్స్
-5నుంచి -10 ఎకరాలు లోపు వారికి మాత్రమే...?
-ప్రభుత్వ ఉద్యోగస్తులకు కట్..?
-ఐటి కట్టే వారికి GST, ఉన్నవారికి రైతు బంధు బంద్...?
-20లక్షల పైన లోన్ ఉన్నవారికి కట్...?" అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ప్రస్తుతం ఉన్న రైతు బంధు పథకానికి ప్రభుత్వం ఎలాంటి మార్పులను ప్రకటించలేదని న్యూస్‌మీటర్ గుర్తించింది.
రైతు బందు మొత్తాలను తక్షణమే రైతుల ఖాతాలకు బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని.. వన్‌ఇండియా, ది హిందూ, డెక్కన్ క్రానికల్ వంటి అనేక వార్తా సంస్థలు నివేదించడాన్ని మేము కనుగొన్నాము. వాట్సాప్ ఫార్వార్డ్‌లో పేర్కొన్నట్లుగా స్కీమ్‌లో ఎలాంటి మార్పుల ప్రకటన లేదు.
మేము వైరల్ వాట్సాప్ సందేశంలో సమాచారం గురించి తెలుసుకోడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డిని సంప్రదించాము. వైరల్ అవుతున్న వాదనలలో ఏ మాత్రం నిజం లేదని ఆయన కొట్టేశారు. కొత్త ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రస్తుత నిబంధనలు, మార్గదర్శకాలలో ఎలాంటి మార్పులు చేయలేదని.. ఎకరానికి రూ. 10,000 అంటూ గత ప్రభుత్వ నియమాలని కొనసాగిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు రాలేదుని అన్నారు.
ఎకరాకు రూ.15వేలు రైతుబంధు సాయం, రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీపై సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. వాట్సాప్ ఫార్వార్డ్‌లో ఉన్న ఇతర సమాచారం నకిలీది. ఏవైనా మార్పులు చేయవలసి ఉంటే, అది ప్రభుత్వ పోర్టల్‌లో అధికారికంగా తెలియజేస్తామని అన్నారాయన.
ఈ పథకంపై సమీక్షా సమావేశాన్ని కూడా న్యూస్‌మీటర్ నివేదించింది. నివేదిక ప్రకారం, “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో, రైతు భరోసా పథకంతో సహా ఆరు హామీలను వాగ్దానం చేసింది. రైతు భరోసా కింద, రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు రూ. 15,000; వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12,000, వరి పంటలకు సంవత్సరానికి రూ. 500 బోనస్ ఇవ్వనుంది. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులు పొందుతున్న రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇక ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త నిబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్ లేదా పత్రికా ప్రకటనను కనుగొనలేకపోయాము.
రైతు బంధు పథకం అంటే ఏమిటి?
తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయాన్ని పెంపొందించడానికి రైతు బంధు పథకాన్ని తీసుకుని వచ్చారు. వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడులకు మద్దతు పథకాన్ని 2018-19 ఖరీఫ్ సీజన్‌లో ప్రవేశపెట్టారు. రైతుల కొన్ని అవసరాలు అయినా తీరుతాయన్నది ప్రభుత్వ ఆలోచన. వ్యవసాయం, ఉద్యానవన పంటలకు పెట్టుబడి మద్దతు కింద సీజన్‌కు ఎకరానికి రూ. 5,000 చొప్పున ఇస్తూ ఉంటారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యక్ష రైతు పెట్టుబడి మద్దతు పథకం, నగదు నేరుగా రైతుల అకౌంట్లలోకి చెల్లిస్తారు.
కాబట్టి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Credits : Sunanda Naik