ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా సంస్థ రాకెట్ దాడి చేసినట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారు ఈ వీడియోను “ఉత్తర ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా రాకెట్ల దాడి చేసింది. ఫుటేజ్ ప్రకారం కొన్ని రాకెట్లు ఐరన్ డోమ్‌ను దాటాయి. సెక్రటరీ ఆస్టిన్ USS అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, F-35C ఫైటర్లతో కూడిన సెంట్రల్ కమాండ్ ఏరియాకు తన రవాణాను వేగవంతం చేయాలని ఆదేశించాడు. ” అంటూ పోస్టు ఉంది.
“Northern Israel is reportedly under attack from Hezbollah rockets. From the footage at least some of the rockets have bypassed the iron dome... Secretary Austin has ordered the USS ABRAHAM LINCOLN Carrier Strike Group, equipped with F-35C fighters, to accelerate its transit to the Central Command area of responsibility, adding to the capabilities already provided by the USS THEODORE ROOSEVELT Carrier Strike Group. Additionally, the Secretary has ordered the USS Georgia (SSGN 729) guided missile submarine to the Central Command region. (sic)” అంటూ ట్వీట్ పెట్టారు.
ఈ వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో 2023 ఆగస్టు నాటిది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా.. 2023 ఆగస్టు 30న BBC అందించిన నివేదికను మేము గమనించాం. ‘Ukraine will not go unpunished, Russia says after drone attacks’ అంటూ వీడియోను పోస్టు చేసింది. దీన్ని బట్టి ఇది ఉక్రెయిన్ మీద జరిగిన దాడి అని స్పష్టంగా తెలుస్తోంది.
దీంతో ఆ వీడియో ఇజ్రాయెల్‌కు చెందినది కాదని తేలింది.
ఉక్రెయిన్ రాజధానిపై దాడి జరిగిందని ఆ నివేదిక పేర్కొంది. పలు భవనాలు శిథిలమయ్యాయి. రాత్రికి రాత్రే ఆరు వేర్వేరు ప్రాంతాలపై డ్రోన్ దాడులు జరిగాయి.
కీవర్డ్ సెర్చ్‌లో ఆగస్టు 30, 2023న ‘కీవ్‌పై భారీ క్షిపణి, డ్రోన్ దాడి కనీసం 2 మందిని చంపింది’ అనే శీర్షికతో DW ద్వారా వీడియో నివేదికను గుర్తించాం.
వీడియో నివేదిక ప్రకారం, రష్యా క్షిపణులు, డ్రోన్‌ల దాడిలో కైవ్‌లో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది.
కాబట్టి, ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా చేసిన దాడికి సంబంధించిన వీడియో అంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది ఆగస్టు 2023లో ఉక్రెయిన్‌లోని కైవ్‌పై జరిగిన దాడి.