హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా బందోబస్తు కోసం వచ్చిన తెలంగాణ పోలీసులకు మంచినీరు కూడా అందించలేదన్న కథనాలు వైరల్ అవుతున్నాయి.
సరైన సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో.. పోలీసు సిబ్బంది బురద నీటితో చేతులు కడుక్కోవాల్సి వచ్చింది
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. అప్పుడు పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయని వైరల్ వీడియోను షేర్ చేస్తూ వచ్చారు.
వైరల్ వీడియోలో పోలీసు యూనిఫాంపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ లోగోను గమనించాము.
మేము వైరల్ వీడియో గురించిన సమాచారం కోసం సంబంధిత కీలక పదాలతో YouTubeలో శోధించాము. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు సంబంధించిన ఫుటేజీని 10టీవీ న్యూస్ లో చూశాం.
'నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భీమవరం పోలీసులు' అని వీడియో టైటిల్‌లో ఉంది.
125వ జయంతి వేడుకల్లో భాగంగా అల్లూరి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆ సమయంలో చోటు చేసుకున్నదిగా చెబుతున్న వీడియోలో ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.