యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని సొంత ప్రభుత్వంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోను షేర్ చేస్తున్న వారు ఆరోపిస్తున్నారు.
"విజయనగరం జిల్లాలో గిరిజనులకి వైద్య సేవలు అందడం లేదు,బైక్ అంబులెన్సు లు పని చెయ్యట్లేదు, సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో బాలికలు, గర్భిణీ మహిళలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు అని @PushpaSreevani గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... @VidadalaRajini ఇదేనా అంతర్జాతీయ స్థాయి వైద్యం అంటే" అంటూ వీడియోను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ :
ఆ వీడియో 2018 నాటిదని, శ్రీవాణి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారని న్యూస్‌మీటర్ కనుగొంది.
వైరల్ పోస్ట్ కింద ఉన్న కామెంట్లలో ఈ వీడియో ఐదేళ్ల నాటిదని, 2018లో టీడీపీ ప్రభుత్వంపై శ్రీవాణి విమర్శలు గుప్పించారని ఒక వినియోగదారుడు చెప్పడం మేము కనుగొన్నాము.
ఆ కామెంట్ ను చూశాక, మేము సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. ధృవీకరించబడిన YouTube ఛానెల్ 2Day 2Morrow ద్వారా సెప్టెంబర్ 5, 2018న ప్రచురించిన వైరల్ వీడియోను కనుగొన్నాము. ‘kurupam mla pushpa sri vani Emotional Speech About Girijana Peoples.’ అంటూ వీడియోను పోస్టు చేశారు.
ఈ వీడియో 2018 నాటిదని శ్రీవాణి స్పష్టం చేసినట్లు ఆర్‌టీవీ న్యూస్ నెట్‌వర్క్ ద్వారా ఒక నివేదికను కూడా మేము చూశాము. తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి ఈ వీడియో నిదర్శనమని ఆమె విమర్శలు గుప్పించారు.
మేము డిసెంబర్ 16, 2023న RTV అనే YouTube ఛానెల్‌లో అప్లోడ్ చేసిన వివరణకు సంబంధించిన వీడియోను కూడా కనుగొన్నాము. ‘Pamula Pushpa Sreevani Angry On TDP.’ అంటూ వీడియోను పోస్టు చేశారు.
శ్రీవాణి అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ప్రచురించిన వివరణను కూడా మేము కనుగొన్నాము.
కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదని.. శ్రీవాణి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam