FactCheck : తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాను పార్లమెంట్ నుండి లాగేశారా?
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు పడింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Dec 2023 8:30 PM ISTడబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ 500 పేజీల నివేదకలో ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు. నివేదికను లోక్‌సభ ఆమోదించడంతో మహువా మెయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. నివేదికపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మహువా మెయిత్రాని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో మహువా పార్లమెంట్ నుండి బయటకు వెళ్లిపోయారు.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు మొయిత్రాను పార్లమెంటు నుండి బలవంతంగా బయటకు లాగేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆమెను బహిష్కరించడాన్ని నిరసిస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు.
Loudspeaker 📢 Mahua Moitra expelled from the Lok Sabha in 'cash for query' matter. #mahuamoitrascandal #MahuaMoitra #HaramiMahua pic.twitter.com/XHkSp5hvde
— Yashpreet Kaur Rana (@ranayashk) December 8, 2023
“Loudspeaker.. Mahua Moitra expelled from the Lok Sabha in ‘cash for query’ matter. #mahuamoitrascandal, (sic)” అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో ఇటీవలిది కాదని స్పష్టంగా తేలింది.
ఇటీవల మహువా మోయిత్రా బహిష్కరణకు సంబంధించినది కాదని.. అక్టోబర్ 3 నాటిదని న్యూస్ మీటర్ కనుగొంది.
మేము సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. టైమ్స్ ఆఫ్ ఇండియా తన యూట్యూబ్ ఛానెల్‌లో అక్టోబర్ 4న ప్రచురించిన వీడియోను కనుగొన్నాము, ’‘Mahua Moitra DRAGGED, forcefully removed from Krishi Bhawan by Police.’ అంటూ వీడియోను పోస్టు చేశారు.
వివరణలో TMC నాయకులను కృషి భవన్ నుండి బలవంతంగా బయటకు లాగేశారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఆరోపిస్తూ ప్రతినిధి బృందాన్ని మూడు గంటలపాటు వేచి ఉండేలా చేసిన తర్వాత వారిని కలవడానికి నిరాకరించారు. అనంతరం మంత్రిని కలవకుండా వెళ్లేది లేదని టీఎంసీ ప్రతినిధి బృందం ధర్నాకు దిగింది.
ఇండియా టుడే కూడా అక్టోబర్ 3న జరిగిన ఈ సంఘటనను నివేదించింది. మొయిత్రా ఇతర TMC నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఢిల్లీ పోలీసులు ఈడ్చుకెళ్ళారని పేర్కొంది. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ నిధుల విడుదలపై దేశ రాజధానిలోని కృషి భవన్‌లో సంఘటన జరిగినట్లు కూడా పేర్కొంది.
మహువా మొయిత్రా తన X ఖాతా ద్వారా అక్టోబర్ 3న వీడియోను కూడా పోస్ట్ చేశారు. “This is how elected MPs of the world’s largest democracy are treated after being given an appointment to meet with a Minister of the Govt of India (which she refused to honour after making us wait 3 hours),” అంటూ ఆమె వీడియోను పోస్టు చేశారు.
This is how elected MPs of the world’s largest democracy are treated after being given an appointment to meet with a Minister of the Govt of India (which she refused to honour after making us wait 3 hours)
— Mahua Moitra (@MahuaMoitra) October 3, 2023
Shame @narendramodi shame @AmitShah pic.twitter.com/cmx6ZzFxBu
అందువల్ల, ఈ వీడియో పాతదని.. ఇటీవల మహువా మొయిత్రాను బహిష్కరించిన తర్వాత పార్లమెంటు నుండి బయటకు లాగేయలేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam