కృత్రిమంగా కోడి గుడ్లను కూడా తయారు చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కృత్రిమ కోడి గుడ్లను ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. గుడ్డు ఆకారపు ప్లాస్టిక్ కంటైనర్లలో ఇద్దరు మహిళలు తెల్లటి పదార్థాన్ని పోస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ఈ వీడియో చూసి చైనీయులు నకిలీ ప్లాస్టిక్ గుడ్లను తయారుచేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజ నిర్ధారణ :
వీడియోలో చూపిన గుడ్లు కేవలం బొమ్మలు మాత్రమేనని.. వాటిని తినడానికి ఉద్దేశించినవి కావని NewsMeter బృందం కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించగా.. మేము అదే విజువల్స్‌ను కలిగి ఉన్న ఒక కథనాన్ని అబ్జర్వర్స్‌లో కనుగొన్నాము. "“No, the Chinese aren’t trying to poison us with plastic eggs.” అని శీర్షిక పెట్టారు. వైరల్ వీడియోలో గుడ్డు లాంటి స్లైమ్ ప్యాక్ తయారు చేస్తున్నారని.. నకిలీ గుడ్లు కాదని స్పష్టంగా తెలుస్తోంది.
మేము వైరల్ వీడియోలో తయారు చేస్తున్న గుడ్డు ఆకారపు స్లైమ్ తో ఆడుకుంటున్న అమ్మాయి ఉన్న YouTube వీడియోని కూడా మేము కనుగొన్నాము.
షాంఘైకి చెందిన వార్తా సంస్థ Jiefang Daily ప్రకారం.. వీడియోలో ఓ టాయ్ తయారీని చూపుతుంది.
మేము ఆన్‌లైన్‌లో స్లైమ్ ఎగ్ కోసం కూడా శోధించాము. ఇ-కామర్స్ సైట్ Alibaba.comలో ఇలాంటి పలు ఉత్పత్తులను కనుగొన్నాము.
దీన్ని బట్టి, వైరల్ వీడియోలో నకిలీ గుడ్లు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ అంటూ జరుగుతూ ఉన్న వార్తల్లో నిజం లేదని స్పష్టమవుతోంది. కాబట్టి, వైరల్ దావా తప్పు.
Credits:Sunanda Naik