అరుస్తున్న పాము అంటూ గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని వెలిచాల గ్రామంలో ఈ వింత పాము కనిపించిందని చెబుతూ వస్తున్నారు. పలువురు నెటిజన్లు నిజంగానే కరీంనగర్ లో వింతపాము కనిపించిందని వార్తలను వైరల్ చేశారు.
కరీంనగర్ లోని ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య సంచరిస్తోందని.. స్థానికులు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Archive links:
https://web.archive.org/save/https://www.facebook.com/balakrishna.y.188/videos/308185574357450
https://web.archive.org/save/https://www.facebook.com/100008607186895/videos/2575878579375690
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో సెర్చ్ చేయగా.. యుట్యూబర్ అయిన మార్క్ మార్టిన్ ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "Hognose hits the high notes", "Singing snake strikes again" అంటూ వీడియోలను మే నెలలో అప్లోడ్ చేశారు.
ఈ వీడియోను తీశారో సరైన సమాచారం లభించలేదు కానీ.. కరీంనగర్ లో తీసింది మాత్రం కాదని తేలింది.
స్థానిక సిఐ వివేక్ కూడా ఈ వదంతులను ఖండించారు. లింగంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశాడు. ఇది నిజమని నమ్మి కొందరు షేర్ చేయడం మొదలు పెట్టారని వివేక్ మీడియాకు తెలిపారు. లింగంపల్లి శ్రీనివాస్ ను పోలీసులు స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను ఎడిట్ చేశానని పోలీసుల ముందు శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. ఇంటి పక్కన యువకులు క్రికెట్ ఆడుతూ ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారని.. వారిని భయపెట్టడానికి తాను ఇలా వీడియోను చేశానని పోలీసుల ముందు తప్పును అంగీకరించాడని తెలుగు మీడియా సంస్థలు తెలిపాయి.
https://tv9telugu.com/telangana/screaming-snake-in-karimnagar-telangana-is-it-real-or-fake-here-is-the-truth-480368.html
https://telugu.asianetnews.com/telangana/fake-snake-shouting-like-man-in-karimnagar-video-viral-bsb-qubdzr
ఈ పాముకు సంబంధించిన మరో వీడియో కూడా దొరికింది. అందులో పాము ఓ వ్యక్తిని కాటేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో నోరు తెరవగా.. ఎటువంటి శబ్దం రాకపోవడాన్ని గుర్తించవచ్చు.
కరీంనగర్ లో 'అరుస్తున్న పాము' అంటూ వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు.