తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల గోదావరి నది ఉధృతంగా ప్రవహించిన సంగతి తెలిసిందే..! దీంతో చాలా గ్రామాలను వరద పోటెత్తింది. వరదలపై ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "భద్రాచలంలో వరద నీటి ప్రవాహం, #వరదలు2022" అని క్యాప్షన్ వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter వైరల్ వీడియోకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. YouTube ఛానెల్ ద్వారా 20 నవంబర్ 2021న "అన్నమయ్య ప్రాజెక్ట్, APలో భారీ వర్షాలు"గా అప్‌లోడ్ చేయబడిన వీడియో కనుగొనబడింది.
ఇదే వీడియోను "Heavy rain in village, #kadapa #Tirupatirain #Tirumala, Andhra Pradesh floods," ఇతర యూట్యూబ్ ఛానెల్‌లు కూడా అప్‌లోడ్ చేశాయి.
నవంబర్ 2021 నాటి వీడియో, కథనాన్ని కనుగొన్నాము.
"ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని చెయ్యేరు నదిపై అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా చాలా గ్రామాలలో విషాదాన్ని నింపింది" అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో ఉంది.
జూలై 2022లో భద్రాచలం ప్రాంతంలో భారీ వరదలు వచ్చినప్పటికీ, వైరల్ వీడియో భద్రాచలానికి సంబంధించినది కాదు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Claim Review:భద్రాచలంలో ఈ స్థాయిలో వరదలు ఇటీవల వచ్చాయా..?