వరదలతో నిండిన రోడ్డుపై ఆటో రిక్షా డ్రైవర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందినదని పేర్కొంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్‌మీటర్ బృందం ఈ వైరల్ క్లెయిమ్ అబద్ధమని కనుగొంది.
14 జూలై 2022న, టైమ్స్ ఆఫ్ ఇండియా అదే వీడియోను "వైరల్ వీడియో: భోపాల్ ఆటో-రిక్షా డ్రైవర్ రెయిన్ డ్యాన్స్ నెటిజన్లను నవ్విస్తోంది" ("Viral video: Bhopal auto-rickshaw driver's rain dance has netizens smiling.") అనే శీర్షికతో ప్రచురించింది.
వీడియో వివరణ.. "భోపాల్ ఆటో-రిక్షా డ్రైవర్ యొక్క ఈ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది. అతని ఆటో వరద నీటి కారణంగా ఇరుక్కుపోయింది, కానీ అతను దాని గురించి ఏడవడానికి బదులుగా, అతను బయటకు వచ్చి వర్షంలో నృత్యం చేశాడు." ("This video of a Bhopal auto-rickshaw driver has netizens smiling. His auto was stuck due to the flood water, but instead of crying over it, he came out and danced in the rain. He clearly took his lesson that when life gives you lemons, make lemonade. He surely tried to make a bad day better.") అని ఉంది.
ఈ వీడియోను టైమ్స్ నౌ యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేసింది, "భోపాల్ వరద నీటిలో ఈ ఆటో డ్రైవర్ డ్యాన్స్ ఇంటర్నెట్‌ను బద్దలు కొడుతోంది." ("This Auto Driver's Dance In Bhopal Flood Water Is Breaking The Internet.") అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియో గుజరాత్‌లో చిత్రీకరించినట్లు అనేక ఇతర నివేదికలు పేర్కొన్నాయి.
ఆ వీడియో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కి చెందినదన్న వాదన అవాస్తవం.