FactCheck : క్యాప్సికంలో ప్రపంచంలోనే అతి చిన్న విషపూరిత పాము ఉందా?

Viral video doesnt show worlds tiniest venomous snake inside capsicum. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు తెల్లటి దారం లాంటి జీవికి సంబంధించిన వీడియోను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 July 2023 9:15 PM IST
FactCheck : క్యాప్సికంలో ప్రపంచంలోనే అతి చిన్న విషపూరిత పాము ఉందా?

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు తెల్లటి దారం లాంటి జీవికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న విషపూరిత పాము అని చెప్పుకొచ్చారు.

వైరల్ వీడియోకు “It is referred to as the world’s tiniest poisonous snake and its often found inside Green Capsicum. Pls always cut open your green Capsicum before you embark on use even if it’s for grinding because its poisonous or use for salad. May we not be victim of circumstance. I implore you to share to safe life. (sic)” అనే క్యాప్షన్ ఇచ్చారు.

"ఇది ప్రపంచంలోనే అతి చిన్న విషపూరిత పాము. ఇది తరచుగా గ్రీన్ క్యాప్సికమ్ లోపల కనిపిస్తుంది. ఆకుపచ్చ క్యాప్సికమ్ లోపల చూసి దేనికైనా ఉపయోగించండి.. అంతేకానీ పట్టించుకోకుండా చేసే పనులకు మనం బలి కాకూడదు. అందరూ సురక్షితమైన జీవితాన్ని గడపాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను." అని అందులో ఉంది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదన తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. వీడియోలోని పురుగు మానవులకు ఎటువంటి హాని కలిగించదు. ప్రపంచంలోని అతి చిన్న విషపూరిత పాము కాదు.

వీడియో ప్రపంచంలోని అతి చిన్న పామును చూపుతోందో లేదో తెలుసుకోవడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాం. BBC ద్వారా డిస్కవర్ వైల్డ్‌లైఫ్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, వీడియోలోని జీవి అధికారికంగా గుర్తించబడిన అతి చిన్న పాము బార్బడోస్ థ్రెడ్ స్నేక్ లేదా టెట్రాచైలోస్టోమా సీలే లాగా కనిపించడం లేదని మేము కనుగొన్నాము.


క్యాప్సికమ్‌లో కనిపించే థ్రెడ్ లాంటి జీవి గురించి సంబంధిత సమాచారాన్ని కనుగొనడానికి మేము పలు కీవర్డ్ సెర్చ్ లను నిర్వహించడం ద్వారా మా పరిశోధనను ప్రారంభించాము. బ్రెజిల్, స్పెయిన్ వంటి దేశాల్లో 2019 నుండి ఈ వీడియో వైరల్ అవుతోందని మేము కనుగొన్నాము. నెమటోడ్స్ లేదా నెమటోమార్ఫ్‌లు అనే జీవికి సంబంధించిన కథనాన్ని మేము చూశాము.

బ్రిటానికా ప్రకారం, నెమటోడ్‌లు జంతువులు, మొక్కలలో పరాన్నజీవులుగా ఉంటాయి. నేల, మంచినీరు, సముద్ర పరిసరాలలో, భూమి లోపల కూడా జీవించగలవు.


నెమటోడ్‌లతో కూడిన కూరగాయలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడం ఇదే మొదటిసారి కాదు. క్యాబేజీ, వంకాయల లోపల నెమటోడ్‌ ఉన్న ఇలాంటి వీడియోలను చాలా కనుగొన్నాము. చాలా జాతుల నెమటోడ్‌లు మానవులపై ఎలాంటి ప్రభావం చూపవని నిపుణులు తెలిపారు.

అయితే, కూరగాయలను కోసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యమని న్యూస్‌మీటర్ బృందం మిమ్మల్ని హెచ్చరిస్తోంది.

Credits : Sunanda Naik



Claim Review:క్యాప్సికంలో ప్రపంచంలోనే అతి చిన్న విషపూరిత పాము ఉందా?
Claimed By:Social media users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story