Fact Check : ఒలింపిక్ గోల్డ్ క్రెడిట్ మోదీకి ఇవ్వకండి అంటూ నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడా..?

Viral Tweet of Olympic Gold Medalist Neeraj Chopra is Hoax. టోక్యో 2020 ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని భారత్ కు అందించాడు. నీరజ్ చోప్రా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2021 9:24 AM GMT
Fact Check : ఒలింపిక్ గోల్డ్ క్రెడిట్ మోదీకి ఇవ్వకండి అంటూ నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడా..?
టోక్యో2020 ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని భారత్ కు అందించాడు. నీరజ్ చోప్రా బంగారు త్రో అథ్లెటిక్స్ లో భారత్ కు బంగారు పతకం లోటును తీర్చింది. నీరజ్ చోప్రా ట్వీట్ చేసినట్లుగా ఓ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


"ఈ గోల్డ్ మెడల్ సాధించడానికి నేను నా కోచ్ ఎంతగానో కష్టపడ్డామని.. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కడానికి వీలు లేదు" అంటూ నీరజ్ చోప్రా ట్వీట్ చేసినట్లుగా ఓ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

పలు సామాజిక మాధ్యమాల్లో యూజర్లు దీన్ని ట్వీట్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్న ట్విట్టర్ ఖాతా @i_m_nirajchopra ట్విట్టర్ లో లేదు. అది కాకుండా ఈ వైరల్ ట్వీట్ ఉన్నది నీరజ్ చోప్రా అధికారిక ట్విట్టర్ ఖాతా కాదుఇక గోల్డ్ కొట్టిన నీరజ్ చోప్రా ట్విట్టర్ ఖాతాలో ఎటువంటి పోస్టు కూడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా లేదు. నీరజ్ చోప్రా ట్విట్టర్ ఖాతాను వెరిఫై కూడా చేశారు.

https://twitter.com/Neeraj_chopra1

ఇక నీరజ్ చోప్రా అకౌంట్ లోని ట్వీట్లను పరిశీలించగా.. ఆగష్టు 8, 2021న ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఎటువంటి ట్వీట్ చేయలేదు.

"Still processing this feeling. To all of India and beyond, thank you so much for your support and blessings that have helped me reach this stage. This moment will live with me forever," అంటూ నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు.

నీరజ్ చోప్రా గోల్డ్ గెలిచాక అతడు చేసే వ్యాఖ్యలపై మీడియా అటెన్షన్ చాలా ఉంటుంది. నీరజ్ చోప్రా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తప్పకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వచ్చేవి. కానీ అలాంటిది జరగలేదు. కాబట్టి నీరజ్ చోప్రా ట్వీట్ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'..

కాబట్టి నీరజ్ చోప్రా చేసినట్లుగా వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టించేవే..!


Claim Review:ఒలింపిక్ గోల్డ్ క్రెడిట్ మోదీకి ఇవ్వకండి అంటూ నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story