FactCheck : పులి దాడి చేస్తున్న చిత్రాలు జార్ఖండ్ లో చోటు చేసుకున్నవా..?
Viral Pictures are not related to Jharkhand tiger Attack. పులి దాడి చేసినట్లుగా.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 July 2022 8:16 AM GMTపులి దాడి చేసినట్లుగా.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జార్ఖండ్‌లోని పలాజోరిలో ఇటీవల పులి దాడికి సంబంధించిన చిత్రాలు ఇవని వినియోగదారులు పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించింది, మేము ఇలాంటి చిత్రాలతో కూడిన తెలుగు మీడియా కథనాన్ని చూశాము. నివేదిక ప్రకారం.. ఈ సంఘటన 19 జూన్ 2022 న జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కిడిసింగి గ్రామంలో 72 ఏళ్ల వృద్ధుడిని ఎలుగుబంటి చంపింది. ఆ మరుసటి రోజే గ్రామానికి చెందిన ఆరుగురిపై ఎలుగుబంటి దాడి చేసింది.
కీవర్డ్ సెర్చ్ ను ఉపయోగించి, మేము 20 జూన్ 2022న వార్తా సంస్థలు ప్రసారం చేసిన ఇలాంటి విజువల్స్ కనుగొన్నాము. నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఎలుగుబంటి దాడిలో కనీసం ఆరుగురు గాయపడ్డారు. ఎలుగుబంటిని ఆ తరువాత బంధించారు. జార్ఖండ్‌లోని పలాజోరి ప్రాంతంలో టైగర్ దాడి చేసిందనే వార్తా కథనాన్ని మేము కనుగొనలేకపోయాము.
https://www.thenewsminute.com/article/eight-andhra-farmers-injured-bear-attack-efforts-capture-animal-165123
https://www.newindianexpress.com/states/andhra-pradesh/2022/jun/21/six-severely-injured-in-bear-attack-in-srikakulam-2468036.html
The female #bear which was created panic in #Vajrapukotturu of #Srikakulam dist, died on its way to Vizag zoo.
— Surya Reddy (@jsuryareddy) June 21, 2022
After postmortem, exact reason will come out that the bear died due to tranquilizer or due to suffered with severe injuries, after fight with a bull.#AndhraPradesh
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎలాంటి నిజం లేదు'.