Fact Check : కాళ్లకు సంకెళ్లతో ఉన్నది స్టాన్ స్వామి అంటూ పోస్టులు వైరల్..!
Viral Picture of Man in Chains is not Father Stan Swamy. భీమా-కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టయిన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 July 2021 2:41 AM GMTభీమా-కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టయిన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మరణించారు. అయితే ఆయన్ను ఆసుపత్రిలో ఉంచిన సమయంలో ఆయన కాళ్లకు సంకెళ్లను ఉంచారంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.
అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇదేనంటూ ఓ పెద్దాయన ఆసుపత్రి బెడ్ మీద ఆక్సిజన్ మాస్కుతో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో ఉన్నది స్టాన్ స్వామి అంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు ట్వీట్లు చేశారు. "Is this the way to treat someone who fights for the country? RIP Father Stan" అంటూ ఫోటోను పోస్టు చేశారు.
వాట్సాప్ లో కూడా ఇదే తరహాలో ఫోటోలను వైరల్ చేశారు. స్టాన్ స్వామిని 80 సంవత్సరాల వయసులో కూడా వేధించింది ప్రభుత్వం అంటూ విమర్శించారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఏ మాత్రం నిజం లేదు.
ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటో మే 2021 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఫోటోలో ఉన్న వృద్ధుడి వయసు 92 సంవత్సరాలు. స్టాన్ స్వామి మరణం తర్వాత పలు మీడియా సంస్థలు స్టాన్ స్వామి ఫోటోలను ప్రచురించాయి. వాటిని బట్టి ఈ ఫోటోలో ఉన్న వృద్ధుడు స్టాన్ స్వామి కాదని తెలుస్తోంది.
https://indianexpress.com/article/india/stan-swamy-dead-elgar-parishad-case-7389891/
ఎన్‌డిటివి నివేదిక ప్రకారం, ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి బాబూరామ్ బల్వాన్ సింగ్ (92). బల్వాన్ సింగ్ హత్య కేసులో దోషిగా తేలాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా జైలులో ఉంచారు. ఫోటో తీసినప్పుడు శ్వాసకోశ సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరారు.
ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తరువాత, యుపి అదనపు డైరెక్టర్ జనరల్ (జైలు), ఆనంద్ కుమార్ వార్డర్ అశోక్ యాదవ్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా జైలర్ నుండి ఉన్నతాధికారులు వివరణ కోరారు.
ఎటా జిల్లాలో 92 ఏళ్ల వ్యక్తిని తన ఆసుపత్రి మంచానికి కట్టారు. జైలు ఖైదీ అయిన వృద్ధుడిని కోవిడ్ అనారోగ్యం కారణంగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండడంతో జైలు అధికారులు జిల్లా మహిళా ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జైలు వార్డెన్ అశోక్ యాదవ్‌ను డిజి జైలు ఆనంద్ కుమార్ సస్పెండ్ చేశారు. ఎటా జైలు సూపరింటెండెంట్ వెంటనే వృద్ధుడికి గొలుసును తొలగించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.
భీమా-కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టయిన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట కరోనా బారినపడ్డ ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్టాన్ స్వామి తుదిశ్వాస విడిచారు. శనివారం ఆయన పరిస్థితి విషమించడంతో అప్పటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. 84 ఏళ్ల స్టాన్ స్వామి కరోనాతో పాటు పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు.గతేడాది అక్టోబరులో ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై స్టాన్ స్వామి అరెస్ట్ కాగా.. మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్నారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో మే 28 కోర్టు ఆదేశాలతో హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి అధికారులు తరలించారు.
ఈ ఫోటోకు స్టాన్ స్వామికి ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది 92 సంవత్సరాల ఖైదీ.