ఫేస్ బుక్ సిఈఓ మార్క్ జూకర్ బర్గ్ భారతప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్నారంటూ ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీకి మార్క్ జూకర్ బర్గ్ మద్దతుగా నిలిచాడంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
"Hi @MarkZukerberg you are a partner in crime with Modi #RipFarmersRipDemocracy #FacebookJioAgainstFarmers (sic)," అంటూ పోస్టులు పెట్టారు. అందులో మార్క్ జూకర్ బర్గ్ కాషాయ వస్త్ర ధారణలో కనిపిస్తాడు. భారతప్రధాని నరేంద్ర మోదీకి ఫేస్ బుక్ కూడా మద్దతుగా నిలిచిందని.. వీరందరూ కలిసి రైతుల ధర్నాను తొక్కేస్తూ ఉన్నారంటూ పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారని స్పష్టం తెలుస్తోంది.
న్యూస్ మీటర్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆ ఫోటోలో కాషాయ వస్త్రధారణలో ఉంది యోగి ఆదిత్యనాథ్ అని స్పష్టంగా తెలుస్తోంది.
ఆగష్టు 2020న Economic Times లో కూడా ఇందుకు సంబంధించిన ఒరిజినల్ పోస్టును పెట్టారు. రామ మందిరం నిర్మాణ శంకుస్థాపనకు వెళ్లే అతిథులకు సంబంధించిన సమాచారాన్ని ఆ పోస్టులో ఉంచారు. ఆర్.ఎస్.ఎస్. కు చెందిన మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతారంటూ అందులో చెప్పుకొచ్చారు.
ABP NEWS ప్రకారం కేవలం 5 మంది మాత్రమే రామ మందిరం నిర్మాణ శంకుస్థాపన సమయంలో వేదిక మీద ఉండాలని నిబంధనలు తీసుకుని వచ్చారు. ఆర్.ఎస్.ఎస్. ఛీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహంత్ నృత్య గోపాల్ దాస్ మాత్రమే వేదిక మీద ఉన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తీ వీడియోను యుట్యూబ్ లో పలు ఛానల్స్ అప్లోడ్ చేశాయి. మోదీ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం దగ్గర నుండి మాట్లాడడం వరకూ వీడియోలో చూడొచ్చు.
వైరల్ అవుతున్న పోస్టు మార్ఫింగ్ అని పక్కాగా చెప్పవచ్చు. యోగి ఆదిత్యనాథ్ స్థానంలో మార్క్ జూకర్ బర్గ్ మొహాన్ని ఉంచారు.