సోషల్ మీడియాలో ఓ పెద్ద చెట్టుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతూ ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద తులసి చెట్టు అంటూ పలువురు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
ఒక పెద్ద తులసి చెట్టు ఫోటో అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. కర్ణాటకలో ప్రపంచంలోనే అతి పెద్ద తులసి చెట్టు ఉందని.. ఈ ఫొటోలో మీరు చూస్తోంది అదే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఫోటో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఈ ఫోటో ఆకర్షించింది. తులసి మొక్కను హిందువులు పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. హిందువులు పూజిస్తారు. దీనికి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా తులసి చెట్టు మొక్క రూపంలో ఉంటుంది. మరీ ఇంత పెద్దదిగా ఉంటుందా అని నెటిజన్లు షాక్ అవుతూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం ప్రపంచంలో అతి పెద్ద తులసి చెట్టు గురించి ఏవైనా నివేదికలు ఉన్నాయో లేదో అని తనిఖీ చేయడానికి.. కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. కానీ ఏదీ కనుగొనబడలేదు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం, P.S సాయి వికాస్ అనే వ్యక్తి ఒక కుండలో ఎత్తైన తులసి మొక్కను పెంచిన రికార్డును కలిగి ఉన్నారు. ఆ మొక్క ఎత్తు 62 అంగుళాలు అని తెలిపారు. దీనిని 26 ఏప్రిల్ 2021న కర్ణాటక ప్రభుత్వం దీని గురించి తెలిపింది. ఈ మొక్కను పెంచింది జిల్లా ఉద్యానవన అధికారిగా ధృవీకరించారు.
ఒక నివేదిక ప్రకారం, "ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉన్న ఎత్తైన తులసి మొక్క గ్రీస్‌లో ఉంది. అనస్తాసియా గ్రిగోరాకి అనే వ్యక్తి దీనిని పెంచారు. మొక్క ఎత్తు 334 సెంటీమీటర్లు అని తెలుస్తోంది."
బ్రిటానికా ప్రకారం.. పవిత్ర తులసి మొక్క ఒక మీటరు (3.3 అడుగులు) ఎత్తు వరకు పెరుగుతుంది.
వైరల్ ఫోటోలో ఉన్న చెట్టు ప్రపంచంలోనే ఎత్తైన తులసి కాదని తేలింది. ఈ ఫోటో నకిలీది.