ఎన్‌డిటివి పోల్ ఆఫ్ పోల్స్ చేసిన ఒపీనియన్ సర్వే కు సంబంధించిన ధృవీకరించబడని చిత్రం ఒకటి వైరల్ అవుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 75 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.
“#Congress75inTelangana BREAKING NOW - NDTV Poll of Polls gives Majority to Congress in TELANGANA. (sic)” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.
వైరల్ ఫోటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే తన ఫేస్‌బుక్ ఖాతాలో కూడా పంచుకున్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ కు సంబంధించిన వైరల్ పోల్ నకిలీదని గుర్తించింది.
మేము ఇదే అంశంపై సంబంధిత మీడియా నివేదికలను కనుగొనడానికి కీవర్డ్ సెర్చ్ చేశాం. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని లేదా ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఏ మీడియా నివేదికను కూడా మేము కనుగొనలేకపోయాము.
నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ తెలంగాణ మీడియాలో ప్రకటనలు ఇస్తోందని ఫిర్యాదులు అందినట్లు జీ బిజినెస్‌లో ఒక కథనం కూడా మాకు అందింది. బీఆర్‌ఎస్ పార్టీ పోల్ ప్యానెల్ దృష్టికి తీసుకుని వెళ్ళింది. దీంతో ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడలేదని, వైరల్‌గా ఉన్న చిత్రం ఫేక్ అని స్పష్టమవుతోంది.
NDTV అధికారిక X ఖాతాలో ఈ ఫోటోను ఫేక్ అని నిర్ధారించింది. NDTV అటువంటి పోల్ సర్వే ఏదీ నిర్వహించలేదని పేర్కొంటూ NDTV ద్వారా ఒక వివరణను మేము కనుగొన్నాము.
NDTV ట్వీట్ లో “#FakeNewsAlert | NDTV #Telangana2023కి సంబంధించిన ఎలాంటి పోల్‌లను నిర్వహించలేదు. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. ” అని ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటో ఫేక్.
Credits : Sunanda Naik