FactCheck : నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయనే వైరల్ మెసేజీ నిజమేనా..?

Viral Message about Four Kidney Donations is Fake. దానం చేసేందుకు నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయని ఓ సందేశం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jan 2022 9:09 PM IST
FactCheck : నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయనే వైరల్ మెసేజీ నిజమేనా..?

దానం చేసేందుకు నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయని ఓ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో మరణించారని, బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారని మరియు ఇప్పుడు వారి కిడ్నీలను దానం చేస్తున్నామని ఆ మెసేజీలో ఉంది.


ఆ మెసేజీ కింద ఫోన్ నంబర్ కూడా ఉంచారు.

"Dear all, Important, 4 kidneys available. Due to death of our friend Mr Sudhir and his wife (my service colleagues) who met with an accident yesterday, doctor has declared them brain dead. Mr Sudhir is B+ and his wife O+. His family wants to donate their kidneys for humanity. Please circulate. Contact 9837285283 (sic)." అంటూ మెసేజీని షేర్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.

NewsMeter సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్‌లో సెర్చ్ చేసి, 2 మే 2018న ప్రచురించబడిన 'YourQuote' వెబ్‌సైట్‌లో అదే సందేశాన్ని కనుగొంది.

అదే ఫోన్ నంబర్‌తో ఉన్న ఈ వైరల్ సందేశం నాలుగు సంవత్సరాల క్రితం అక్టోబర్ 2017లో Facebook, Twitterలలో కూడా పోస్ట్ చేయబడింది. ఇది 2020, 2021 సంవత్సరాలలో కూడా వైరల్ అయింది.

న్యూస్‌మీటర్ వైరల్ మెసేజీలో అందించిన నంబర్‌ను సంప్రదించగా.. "కిడ్నీ దాతలకు సంబంధించిన పోస్ట్ నకిలీ అని.. సరైనది కాదని, కాబట్టి సర్క్యులేట్ చేసి ఫార్వర్డ్ చేయవద్దు" అని సమాధానం వచ్చింది. SM హాక్స్ స్లేయర్ ప్రకారం, ఫోన్ నంబర్ మీరట్‌కు చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గార్గ్‌కి చెందినది.


హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ యాక్ట్ 1994 ప్రకారం ఇలా అవయవ దానం మెసేజీలు పెట్టడం చట్టవిరుద్ధం.. కాబట్టి ఈ పద్ధతిలో అవయవ దానం గురించి ప్రచారం చేయడం, అభ్యర్థించడం సాధ్యం కాదని టైమ్స్ ఆఫ్ ఇండియా గతంలో నివేదించింది. ఎవరైనా దానం చేయాలనుకుంటే, చికిత్స చేస్తున్న వైద్యుడికి తెలియజేయాలని పేర్కొంది. ఆసుపత్రి ప్యానెల్‌ నిర్ణయించాకే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించి అవయవ దానం అంశాన్ని కొనసాగించవచ్చు. ఇక అవయవాల విక్రయం కోసం ప్రకటనలు చేయడం నిషేధించబడింది.. అది క్రిమినల్ నేరంగా పరిగణించబడుతోంది.

ఈ సందేశం నకిలీదని, చాలా కాలంగా ప్రచారంలో ఉందని ది హిందూ, తెలంగాణ టుడే నివేదికలు కూడా మేము కనుగొన్నాము.


Claim Review:నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయనే వైరల్ మెసేజీ నిజమేనా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story