"Time to go" అంటూ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోతున్నట్లుగా ఉన్న ఫోటోను టైమ్ మ్యాగజైన్ తన కవర్ ఫోటోలో ఉంచిందంటూ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటో అదని చెబుతూ ఉన్నారు.
"Loving the Time magazine front cover: #TrumpOut" అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటో చాలా బాగుంది. మాకందరికీ చాలా నచ్చింది అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. నావలిస్ట్ శోభా డే కూడా ఈ ఫోటోను ట్వీట్ చేశారు.
నిజ నిర్ధారణ:
ట్రంప్ ను సాగనంపుతున్నట్లుగా వైరల్ అవుతున్న ఫోటో నిజం కాదు.
టైమ్ మ్యాగజైన్ టైమ్ లో కూడా ఈ కవర్ ఫోటో కనిపించలేదు. టైమ్ మ్యాగజైన్ ప్రతులను ఉంచే 'ది వాల్ట్' లో కూడా ఇలాంటి కవర్ ఫోటోను ఉంచినట్లుగా కనిపించలేదు.
ముఖ్యంగా టైమ్ మ్యాగజైన్ లే అవుట్ కు.. వైరల్ ఫోటోకు ఎటువంటి పోలిక కూడా లేదు. నిశితంగా పరిశీలించగా.. మ్యాగజైన్ కవర్ పేజీ మీద డేట్ ఆఫ్ ఇష్యు.. లాంటివన్నీ తప్పుగా ఉన్నాయి. ఎటువంటి పోలికలు కూడా కనిపించలేదు. టైమ్ మ్యాగజైన్ కు సంబంధించిన వెబ్సైట్ వంటి వాటిని వైరల్ ఫోటోలో కనిపించకపోవడం బట్టి.. ఈ ఫోటో మార్ఫింగ్ చేసినదని స్పష్టంగా తెలుస్తోంది.
టైమ్ మ్యాగజైన్ కూడా డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఈ ఫోటో ఫేక్ అని స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.