అమెరికాకు మొట్ట మొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికై కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించింది. తండ్రి జమైకాకు చెందిన వారు కాగా.. తల్లి భారతీయురాలు. తమిళనాడు ప్రజలు కమలా హ్యారిస్ విజయం పట్ల పెద్ద ఎత్తున పూజలు కూడా చేశారు. ఆమె గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించడంతో సంబరాలు, అంబరాన్ని అంటాయి. జనవరి 20, 2021న అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బిడెన్ తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అమెరికా ఎన్నికల్లో ఆమె విజయం సాధించగా ఆమె చీరకట్టులో ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమెను అభినందిస్తూ పలువురు ఈ ఫోటోను పోస్టు చేశారు. ఆమెకు సంబంధించిన పలు విషయాలను సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటో 'నిజమైనది కాదు'. చీరకట్టులో కమలా హ్యారిస్ మురిసిపోతున్నట్లుగా ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేశారు.వైరల్ అవుతున్న ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Bollywood Shaadis.com అనే వెబ్సైట్ లో '15 unique styles of how the sarees are draped in different Indian Styles' అంటూ ఫోటోలను పెట్టారు. 15 పద్ధతుల్లో చీరలను కట్టుకోవచ్చు అని ఇందులో చూపించారు. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న చీరకట్టు పేరు 'మదిరసు'-తమిళనాడు స్టైల్ లో చీరకట్టుకోవడం.

అయ్యర్ కమ్యూనిటీకి చెందిన వివాహితులు ఎక్కువగా 'మదిరసు' పద్ధతిలో చీరను కట్టుకుంటారు. ఇది అర్ధనారీశ్వరుడికి సంకేతం అని చెబుతూ ఉంటారు. చీరలో సగం ధోతిలాగా కట్టుకుంటే.. మిగిలినది చీర లాగా కట్టుకుంటారు.

వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళ ప్రముఖ కర్నాటిక్ సంగీతకారురాలైన 'విశాఖ హరి'.. కథాకాలక్షేపంలో ఆమె పేరుగడించారు. సదరు వెబ్సైట్ లో విశాఖ హరి గారిని ఇతర ఫోటోల్లో కూడా చూడచ్చు. ఆమె అదే చీర.. చీరకట్టులో కనిపిస్తారు.

ఆమె ఈ చీరలో ఉన్న ఫోటోలు మరో లింక్ లో కూడా ఉన్నాయి. వాటిని కూడా గమనించవచ్చు.

http://indiapulse.sulekha.com/local-pulse/vishaka-hari-interview-by-ananya_post_6014

అంతేకానీ, కమలా హ్యారిస్ చీరకట్టులో ఉన్న ఫోటో నిజం కాదు. ఆమె తమిళనాడు మహిళ లాగా మదిరసు పద్దతిలో చీర కట్టుకోలేదు. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న మహిళ ప్రముఖ కర్నాటిక్ వోకలిస్ట్ 'విశాఖ హరి'. ఆమె తలను స్థానంలో కమలా హ్యారిస్ తలను తగిలించి మార్ఫింగ్ చేశారు.


సామ్రాట్

Next Story