కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బాబా గెటప్‌లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
భారత్ జోడో యాత్రలో ఈ చిత్రాన్ని క్లిక్ చేసినట్లు సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. ఇతర కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలట్‌లను కూడా చిత్రంలో చూడవచ్చు.
నిజ నిర్ధారణ :
అసలు చిత్రాన్ని కనుగొనడానికి NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. మేము ఇలాంటి చిత్రంతో కూడిన ట్వీట్‌ను కనుగొన్నాము. దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయడాన్ని చూశాం. ట్వీట్‌లను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా, రాహుల్ గాంధీని కలవడానికి నామ్‌దేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా మధ్యప్రదేశ్‌లోని భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. అప్పటికి సంబంధించిన ఫోటోలని మేము కనుగొన్నాము. ఇది డిసెంబర్ 3, 2022 నాటిదని మేము కనుగొన్నాం.
మరింత సమాచారం కోసం THE TRIBUNE యూట్యూబ్ ఛానల్ లో వీడియోను కనుగొన్నాం. అందులో 'Computer Baba joins Bharat Jodo Yatra' అని ఉంది. కంప్యూటర్ బాబా రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారని గుర్తించాం. వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేసినట్లు కనుగొన్నాం.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.