కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎర్రని దుస్తులు ధరించి త్రిశూలం పట్టుకున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఇమేజ్‌ను షేర్ చేస్తూ.. ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ దేవాలయ సందర్శనలను వెళుతున్నారని అన్నారు. ఎప్పుడూ లేనిది ప్రియాంక గాంధీ వాద్రా దేవాలయాల సందర్శనకు వెళుతున్నారని.. ప్రియాంక గాంధీని ఎగతాళి చేయడానికి నెటిజన్లు ఈ చిత్రాన్ని ఉపయోగిస్తున్నారు.
जिस तेजी वाड्राइन, उर्फ पिंकी मन्दिर मन्दिर घूम रही है, इलेक्शन आते आते कहि राधे मां न बन जाये😊😊 pic.twitter.com/zXJQh3tGnx
న్యూస్‌మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ప్రియాంక గాంధీ ఒరిజినల్ చిత్రాన్ని కలిగి ఉన్న జనసత్తా మీడియా సంస్థ నివేదికను కనుగొంది. ప్రియాంక గాంధీ నుదిటిపై ఎర్రటి గుర్తు వైరల్ చిత్రంలో కనిపించేంత పొడవుగా లేదు.. అలాగే ఆమె త్రిశూలం పట్టుకోలేదు. ఆమె చేతులు ఒరిజినల్ చిత్రంలో కనిపించవు. కాబట్టి కొందరు కావాలనే ఫోటోషాప్ లో ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది.
జనసత్తా కథనాల ప్రకారం.. ఈ చిత్రం వింధ్యవాసిని ఆలయంలో తీయబడింది. దీనిని ఉపయోగించి, న్యూస్‌మీటర్ మరిన్ని చిత్రాల కోసం ఆన్‌లైన్‌లో శోధించింది. అసలు చిత్రాన్ని కలిగి ఉన్న అనేక మీడియా సంస్థలను కనుగొంది. ఇక్కడ కూడా ఏ ఫొటోల్లో కూడా పొడవైన ఎరుపు గుర్తు మరియు త్రిశూలం లేదు.
ఈ చిత్రం 2019 మార్చిలో ఉత్తర ప్రదేశ్‌లో మూడు రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ వింధ్యవాసిని దేవాలయాన్ని సందర్శించినప్పుడు తీయబడింది. కాంగ్రెస్ కోసం ఆమె ప్రచారంలో వివిధ దేవాలయాలను సందర్శించారు.
కాబట్టి వైరల్ అవుతున్న ఫోటోల్లో ఉన్నట్లుగా.. ప్రియాంక గాంధీ త్రిశూలాన్ని పట్టుకోలేదు. ఆ ఫోటో ఇటీవలి కాలంలో తీసినది కూడా కాదు.
Claim Review:ప్రియాంక గాంధీ శూలాన్ని పట్టుకుని పూజలకు కూర్చున్నారా..?