Fact Check : ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ను పూలమాలలతో నింపేశారా..?

Viral Image of Heavily Garlanded French President Macron is Morphed. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పై భారీగా పూలమాలలు వేసిన చిత్రం సోషల్ మీడియాలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2021 8:12 PM IST
Fact Check : ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ను పూలమాలలతో నింపేశారా..?

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పై భారీగా పూలమాలలు వేసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

"ప్రెసిడెంట్ మాక్రాన్ ఫ్రెంచ్ పాలినేషియా కు అధికారికంగా స్వాగతం పలికిన సమయంలో ఆయనను మానవ పుష్పగుచ్ఛముగా మార్చబడ్డారు" అనే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

భారీగా పూలమాలలు వేసిన వైరల్ ఇమేజ్‌ను చూపించే ఒక చిన్న వీడియోను కూడా కొందరు షేర్ చేశారు.

ఎంతో మంది ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అలాగే పలువురు వెరిఫై పొందిన యూజర్లు, ప్రముఖులు కూడా ఈ వీడియోను పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోలలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియోను మార్ఫింగ్ చేశారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మోకాళ్ళ వరకూ పూల దండలు వేశారనే కథనాల్లో ఎటువంటి నిజం లేదు. అది పూర్తిగా మార్ఫింగ్ చేయబడింది.

గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, ఇమేజ్ మార్ఫింగ్ చేయబడిందని మేము కనుగొన్నాము. పాన్-యూరోపియన్ టెలివిజన్ న్యూస్ నెట్‌వర్క్ అయిన యూరో న్యూస్ వార్తా నివేదికలో ఫ్రెంచ్ అధ్యక్షుడిని పూలమాలలతో స్వాగతించినట్లు చూపిస్తుంది. అయితే కొన్ని దండలు మాత్రమే కనిపిస్తాయి.

'ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ ఫ్రెంచ్ పాలినేషియాలోని కాలనీలను సందర్శించారు' అనే శీర్షికతో, నివేదికలో ఒక నిమిషం మరియు ఇరవై సెకన్ల నిడివి గల వీడియో క్లిప్ ఉంది.


యూరో న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా మేము అదే వీడియోను కనుగొన్నాము. 54 సెకన్ల సమయం దగ్గర వీడియో వాస్తవ పరిస్థితిని చూపుతుంది. వైరల్ అవుతున్నట్లుగా అన్ని పూలమాలలు ఒకటేసారి వేసి చూపించలేదు.

మాక్రోన్ యొక్క ఎడిటింగ్ వీడియో ద్వారా అనేక అవుట్‌లెట్‌లు మోసపోయాయని `sputniknews.com ' లో కథనం కూడా వచ్చింది. ఆ నివేదికను కూడా మేము కనుగొన్నాము.

నివేదిక ప్రకారం, ఎడిట్ చేసిన వీడియో లఘు చిత్రాల సృష్టికి ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ వ్యంగ్య ట్విట్టర్ అకౌంట్ ఇల్యూమినాటి రెప్టిలియన్ నుండి వచ్చింది. ఫ్రెంచ్ పాలినేషియా అధికారులలో ఎనిమిది సెకన్ల వీడియోను అధ్యక్షుడిని సాంప్రదాయ దండలతో వేయడాన్ని చూడొచ్చు. వీడియో యొక్క చివరి సెకన్లలో మాక్రాన్ ఇతర అధికారులతో కలిసి అతని తల నుండి మోకాళ్ల వరకు పూర్తిగా పూలతో కప్పబడి ఉన్నాడు. అది పక్కా ఎడిట్ చేసిందని తెలుస్తోంది.

ఈ మార్ఫింగ్ వీడియో నుండి కొందరు వ్యక్తులు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ఒరిజినల్‌గా భావించి షేర్ చేసారు. ఇది అందరినీ మోసం చేసింది.

ఎడిటెడ్ వీడియోలను రూపొందించడం కోసం ఇల్యూమినాటి రెప్టిలియన్ ఫ్రెంచ్ మీమ్స్ కల్చర్‌లో బాగా ప్రసిద్ధి చెందిందని నివేదిక పేర్కొంది. కొన్నిసార్లు, వారు రాజకీయ నాయకులు, ఇతరులు పోస్ట్ చేసిన వీడియోలను వాడి ఇలా చేస్తారు. టెలివిజన్‌లో కనిపించే క్లిప్‌లను ఉపయోగిస్తారని.. అందరికీ నవ్వు తెప్పించేందుకు ఇలా చేస్తారని పలువురు తెలిపారు.

ఈ దావాను smhoaxslayer.com కూడా తప్పుబట్టింది.

కాబట్టి మార్ఫింగ్ చేసిన ఇమేజ్ ఒరిజినల్‌గా ప్రచారం చేశారు. వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదు.


Claim Review:ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ను పూలమాలలతో నింపేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story