కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనానికి మొత్తం పచ్చటి పెయింటింగ్ ఉందని.. నెలవంక మరియు స్టార్ సింబల్ కూడా ఆ బిల్డింగ్ కు ఉందని పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు చెబుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ కు ఇలా పచ్చని రంగు వేశారని చాలా మంది పోస్టులు పెట్టారు.
ఫోటోను పంచుకున్న ఫేస్‌బుక్ యూజర్, "ఇది వయనాడ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం.. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఎందుకు ఇంత ఉదారంగా ఉందో ఇప్పుడు మీరు ఊహించవచ్చు".. "కాంగ్రెస్ హిందువుల పార్టీ అని నమ్మే పొరపాటును మీరు ఎంతకాలం చేస్తారు?" అంటూ పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
పచ్చని రంగుతో ఉన్న భవనం కేరళలోని కాంగ్రెస్ కార్యాలయం అనే వాదన అబద్ధం.
భవనంపై అనేక పదాలు, చిహ్నాలను న్యూస్‌మీటర్ గమనించించింది. ఈ భవనం కాంగ్రెస్‌కు అనుసంధానించబడలేదు. ఈ భవనం ప్రధానంగా కేరళ మరియు తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీ అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) కు సంబంధించింది. కింద పూర్తీ వివరాలను గమనించవచ్చు.
1. ఎడమ ఎగువ మూలలో, నిచ్చెన యొక్క చిహ్నాన్ని చూడవచ్చు. ఇది IUML పార్టీకి చిహ్నం.
2. ఎడమ వైపున ఉన్న వ్యక్తి చిత్రం గమనిస్తే.. అందులో ఉన్నది ఐయుఎంఎల్ కేరళ రాష్ట్ర కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సయ్యద్ మహ్మద్ అలీ షిహాబ్.
3. కుడి వైపు పైన మూలలో, మలయాళంలో వ్రాసిన వచనాన్ని చూడవచ్చు. ఇది 'ఇక్బాల్ నగర్ లీగ్ హౌస్' అని అర్థం వస్తుంది.
4. నెలవంక చంద్రుడు మరియు నక్షత్రం యొక్క చిహ్నం IUML పార్టీ జెండా.
5. ఎగువ ఎడమ వైపున, మలయాళంలో ఒక వచనాన్ని చూడవచ్చు. ఇది 2001 లో చంపబడిన IUML కార్యకర్త "ఐ మొయిడు హాజీ" అని అనువదిస్తుంది.
6. విద్యుత్ స్థంభంపై మలయాళంలో కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని కన్హంగాడ్ పట్టణంలో భాగమైన "ఇక్బాల్ నగర్" ను సూచిస్తుంది.
వైరల్ చిత్రం కాంగ్రెస్ కార్యాలయం కాదని.. ఇది IUML పార్టీ భవనం అని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న మెసేజీల్లో 'ఎటువంటి నిజం లేదు'.