ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం నుండి రక్షించిన తర్వాత 41 మంది కార్మికులు కలిసి భారత జెండాతో గ్రూప్ ఫోటోకు పోజులిచ్చారని ఓ చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
హిందుస్థాన్ టైమ్స్ వంటి కొన్ని ప్రధాన స్రవంతి వార్తా ఏజెన్సీలు ఇది ఒరిజినల్ అని తెలీకుండా ఫోటోను ఎలా ప్రచురించాయని.. చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు ఎత్తి చూపారు.
17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను ఇటీవలే రక్షించారు. వీరిని రక్షించడంలో భారత సైన్యం సహా పలు బృందాలు పాల్గొన్నాయి. నవంబర్ 28న 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు, NDRF సిబ్బంది కార్మికులను రక్షించడంతో సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. కార్మికులందరి ఆరోగ్యం బాగానే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న ఫోటో AI ద్వారా రూపొందించారని NewsMeter కనుగొంది.
కార్మికుల వైరల్ ఇమేజ్‌ను నిశితంగా విశ్లేషించినప్పుడు, చిత్రంలో ఉన్న వ్యక్తులకు అదనపు వేళ్లు.. ఒకే వ్యక్తికి సంబంధించిన కళ్ళు వేర్వేరు దిశల్లో చూడటం.. కొందరి ముఖాలు అస్పష్టంగా ఉండటం వంటి అసంపూర్ణ లక్షణాలను కలిగి ఉన్నాయని మేము మొదట కనుగొన్నాము.
మేము చిత్రం దిగువ కుడి వైపున Exclusive Minds అని ఉన్న వాటర్‌మార్క్‌ను కూడా కనుగొన్నాము. ఈ చిత్రం అప్‌లోడ్ చేసిన X ఖాతాని మేము కనుగొన్నాము. అవన్నీ ఏఐ తో రూపొందించినట్లు గుర్తించాం.
ఈ చిత్రాలు AI- రూపొందించినవి అని పేర్కొంటూ, Alt News సహ వ్యవస్థాపకుడు, మహమ్మద్ జుబేర్ పోస్టు పెట్టారు. #Uttarakhandtunnelrescue ఆపరేషన్లకు సంబంధించి AI ద్వారా రూపొందించిన చిత్రాలను ఎందుకు చాలా మంది షేర్ చేస్తున్నారో చెప్పాలని జుబేర్ ట్వీట్ చేశారు.
చివరగా, మేము AI డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్ ద్వారా చిత్రాన్ని రన్ చేసాము. చిత్రం 99.9 శాతం AI ద్వారా క్రియేట్ చేశారని కనుగొన్నాము.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటో ఏఐ ద్వారా సృష్టించారు.
Credit : Sunanda Naik