Fact Check : హైదరాబాద్ కు చెందిన అహ్మద్ ఖాన్ ను బిడెన్ తన రాజకీయ సలహాదారుడిగా నియమించుకున్నాడా..?
Viral claims that Ahmed Khan from Hyderabad. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవలే విజయం సాధించిన జో బిడెన్ హైదరాబాద్ కు
By Medi Samrat Published on 18 Nov 2020 11:13 PM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవలే విజయం సాధించిన జో బిడెన్ హైదరాబాద్ కు చెందిన అహ్మద్ ఖాన్ ను రాజకీయ విశ్లేషకుడిగా నియమించుకున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. జో బిడెన్ ఆయన భార్య జిల్ బిడెన్ లతో కలిసి అహ్మద్ ఖాన్ ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
A newly Elected President of United States of America Mr. Joe biden has made Mr. Ahmed Khan, a resident of Hyderabad,India his political Advisor...
— Mirwaiz North Kashmir (@PFirdousi) November 12, 2020
Congratulations..@AhmedKhan
#ProudMoments for Muslims.
"A newly elected President of the United States of America Joe Biden has made Ahmed Khan, a resident of Hyderabad, India his political Advisor...Congratulations," అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
అహ్మద్ ఖాన్ ను బిడెన్ తన రాజకీయ సలహాదారుడిగా నియమించుకున్నాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
అహ్మద్ ఖాన్ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ ను న్యూస్ మీటర్ పరిశీలించగా అందులో "Former Deputy Executive Director at @DraftBiden; Former Steering Committee Member at @Illinois4Bernie ; Former @OurRevILChicago.Board Member" అని ఉంది కానీ.. ఎక్కడ కూడా బిడెన్ కు పొలిటికల్ అడ్వైజర్ అని లేదు.
మిగిలిన మీడియా సంస్థలను కూడా పరిశీలించగా ఎక్కడా కూడా అతడిని రాజకీయ సలహాదారుడిగా నియమించిన కథనాలు రాలేదు.
Congratulations to President-elect @JoeBiden and @DrBiden! I wish you the best!
— Ahmed Khan (@cityzenkhan) November 10, 2020
Additionally, congratulations to my former colleagues at the original @draftbiden 2016 team for #RidinWithBiden before it became cool 😎 again in 2020. #PresidentElectJoeBiden ♥️ pic.twitter.com/EC7qy7d9EA
కొన్ని ఫోటోలను అతడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో తీసుకున్న ఫోటోలను పోస్టు చేసి బిడెన్ కు అభినందనలు తెలిపాడు అహ్మద్ ఖాన్. డ్రాఫ్ట్ బిడెన్ టీమ్ లో భాగంగా 2016లో అహ్మద్ ఖాన్ సభ్యుడు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న ఫోటోలు 2015 లో అహ్మద్ ఖాన్ ఫేస్ బుక్ లో అప్లోడ్ చేశాడు.
2015 లో Muslim Mirror లో ఇదే ఫోటోను పోస్టు చేశారు. అప్పట్లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జో బిడెన్, అతడి భార్య డాక్టర్ జిల్ బిడెన్ ఓ రిసెప్షన్ ను వాషింగ్టన్ లోని యుఎస్ నావల్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు అహ్మద్ ఖాన్ హాజరయ్యాడు.
బిడెన్ తన కోవిద్-19 సలహా బృందంలో పలువురు భారత సంతతి వ్యక్తులను కూడా చేర్చుకున్నారు. డాక్టర్ వివేక్ మూర్తి కూడా అందులో ఒకరు.
అహ్మద్ ఖాన్ మీద వైరల్ అవుతున్న పోస్టులు ఇప్పటివి కావు. అహ్మద్ ఖాన్ చికాగోలో నివసిస్తున్న అమెరికన్. అతడిని బిడెన్ రాజకీయ సలహాదారుడిగా నియమించలేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.