వీధికుక్కల దాడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళ తన స్కూటర్‌ను పార్క్ చేసి ఉన్న కారుకు ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బైక్ మీద ఉన్న మరో మహిళ, ఓ పిల్లవాడు కూడా కింద పడిపోయాడు.
ఈ వీడియో హైదరాబాద్‌కి చెందినదని పేర్కొంటూ ఓ ట్విటర్ యూజర్ వీడియోను షేర్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మిని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్యాగ్ చేసి ఈ వీడియోను షేర్ చేశారు. ఘటనపై పరిశీలించాలని మేయర్‌ను కోరారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో ఒడిశాకు చెందినదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసామ. అదే వీడియోను ఏప్రిల్ 4న వార్తా సంస్థ ANI ట్వీట్ చేసింది. ఒడిశాలోని బెర్హంపూర్ సిటీకి చెందిన వీడియో అని ఏజెన్సీ ట్వీట్‌లో పేర్కొంది. ఈ ఘటనలో స్కూటర్‌పై ముగ్గురు ఉన్నారని, వారందరికీ గాయాలయ్యాయని కూడా పేర్కొంది.
మేము NDTV, హిందూస్తాన్ టైమ్స్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించిన వీడియోను కూడా కనుగొన్నాము. ఏప్రిల్ 4 న ప్రచురించిన ఈ నివేదికల ప్రకారం, ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలోని గాంధీ నగర్ 7వ లేన్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని గాంధీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకోలేదని ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ విభాగం చెప్పింది. "కుక్కలు వెంటపడ్డాయి.. స్కూటీ నుండి ఎగిరి పడ్డారు" అన్నశీర్షికతో హైదరాబాద్ గాంధీనగర్‌లో జరిగినట్టు తప్పుడు సమాచారం ఇస్తూ వీడియోతో కూడిన ఒక న్యూస్ క్లిప్
@way2_news యాప్‌లో పబ్లిష్ అయ్యింది. నిజానికి ఈ సంఘటన ఒడిషాలోని బెహ్రంపూర్‌లో జరిగింది. అని స్పష్టం చేసింది.
"ఈ సంఘటన ఒడిషా లో జరిగింది అని PTI వార్తా సంస్థ కూడా నిర్ధారించి, ప్రచురించింది. @way2_news సంస్థ ఈ తప్పుడు వార్తను డిలీట్ చేసి, సవరణను ప్రచురించాలి. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి అసత్య సమాచారాన్నిప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి" అంటూ మరో ట్వీట్ లో స్పందించారు.
కాబట్టి, వైరల్ వీడియో ఒడిశాకు చెందినది. హైదరాబాద్ కు చెందినది కాదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు అని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam