చిన్న చిన్న ట్రైన్స్ లో ఫుడ్ ఐటమ్స్ ను పంపించి.. కస్టమర్స్ దగ్గరకు పంపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది హైదరాబాద్ రైల్వే స్టేషన్ లోని రైల్వే కాంటీన్ అంటూ పలువురు వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.

ఇదొక అద్భుతమైన ఐడియా అంటూ పలువురు నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ :

హైదరాబాద్ రైల్వే స్టేషన్ లోని కాంటీన్ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించగా `Platform 65' అనే పదాలను గుర్తించాము. ఆ పదాలను ఉపయోగించి చూడగా.. అచ్చం అలాంటి బొమ్మ ట్రైన్స్ ఉన్న వీడియోలు కనిపించాయి. న్యూస్ మీటర్ సభ్యులు `Platform 65' అనే రెస్టారెంట్ ను వెళ్లి చూసొచ్చారు.


ఇక `Platform 65' రెస్టారెంట్ అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో వైరల్ అవుతున్న వీడియోను గమనించవచ్చు. ట్రైన్ థీమ్ రెస్టారెంట్ ఇదని గుర్తించాము. మే 25, 2021న వీడియోను అప్లోడ్ చేశారు.. రెస్టారెంట్ లోపలి భాగాన్ని కూడా చూడొచ్చు.

న్యూస్ మీటర్ కీవర్డ్ సెర్చ్ చేయగా 'LBB' అనే వెబ్ సైట్ లోకి వెళ్ళింది. ఈ సైట్ లో ఉన్న ఫోటోలు వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు ఒకటేలా స్పష్టంగా అర్థం అవుతోంది. ట్రైన్ థీమ్ తో మొదలుపెట్టిన రెస్టారెంట్ అని తెలుస్తోంది. సీట్లు కూడా ట్రైన్ లో ఉన్నట్లే ఉన్నాయి.. అలాగే చిన్న చిన్న ట్రైన్స్ టేబుల్స్ మధ్యన తిరుగుతూ ఉండేలా ట్రాక్ లను ఉంచారు.ఈ హోటల్ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉంది కానీ.. హైదరాబాద్ రైల్వే కాంటీన్ కానే కాదు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్‌మీటర్ తెలుగు

Next Story