ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..! తాలిబాన్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాబూల్ లోని ప్రెసిడెంట్ ప్యాలస్ ను తాలిబాన్లు సొంతం చేసుకున్న తర్వాత విందు చేసుకున్నారని పలువురు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలస్ ను తాలిబాన్లు సొంతం చేసుకున్నాక ఆగస్టు 15, 2021న ఇలా విందు చేసుకున్నారని వీడియో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో చెబుతున్నట్లుగా తాలిబాన్లు ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ ప్యాలస్ లో విందు చేసుకున్నారన్నది 'నిజం కాదు'.
న్యూస్ మీటర్ వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Republic World మీడియాకు సంబంధించిన సమాచారం బయటపడింది.
జరాంజ్‌లో గవర్నర్ ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్ యోధులు విందులు చేసుకున్నారని ఇంతకు ముందే వీడియోలు వచ్చాయి. `Reportwire 'ద్వారా అప్‌లోడ్ చేసిన అదే వీడియోను మేము కనుగొన్నాము. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న జర్నలిస్ట్ బిలాల్ సర్వరీకి ఈ వీడియోను తీసినట్లుగా తెలుస్తోంది. ఆగష్టు 11, 2021 న పోస్ట్ చేసిన సర్వరీ ట్విట్టర్ హ్యాండిల్‌లో అదే వీడియోను మేము కనుగొన్నాము. జరాంజ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న కొద్దిసేపటికే నిమ్రోజ్ ప్రావిన్స్‌లో పండ్లు, బిస్కెట్లను సోఫాలపై కూర్చుని తాలిబాన్ యోధులు ఆస్వాదిస్తున్నట్లు ఒక ట్వీట్ కూడా కనుగొన్నాము.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదు. ఈ విందు ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ప్యాలస్ లో చోటు చేసుకోలేదు.