FactCheck : ఎన్నికల్లో ఓడిపోయాక స్మృతి ఇరానీ కుర్కురే కొనుక్కోడానికి స్వయంగా షాప్ కు వెళ్ళారా.?

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, స్మృతి ఇరానీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని 28 తుగ్లక్ క్రెసెంట్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2024 3:30 PM GMT
FactCheck : ఎన్నికల్లో ఓడిపోయాక స్మృతి ఇరానీ కుర్కురే కొనుక్కోడానికి స్వయంగా షాప్ కు వెళ్ళారా.?

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, స్మృతి ఇరానీ ఢిల్లీలోని లుటియన్స్‌లోని 28 తుగ్లక్ క్రెసెంట్‌లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఆమె అమేథీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ నేత కిషోరి లాల్ శర్మ చేతిలో 1.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని అదే స్థానం నుండి ఓడించారామె.

ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో కొన్ని వస్తువులు కొంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత స్మృతి ఇరానీ పరిస్థితి ఈ వీడియో చూపుతుందని పలువురు చెప్పుకొచ్చారు.

ఇరానీని ఎగతాళి చేస్తూ కొందరు పోస్టులను పంచుకున్నారు. "ఆమె బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత, 2 రూపాయల విలువైన కుర్కురే కొనడానికి వెళ్ళింది" అని రాశారు. (ఆర్కైవ్)



https://newsmeter.in/h-upload/2024/07/12/376541-divya-kumari.webp

నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో 2019 నాటిది. కాబట్టి వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము నిర్దిష్ట కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. సెప్టెంబర్ 11, 2019న ప్రచురించిన UP Tak వీడియో నివేదికలో అదే క్లిప్‌ను కనుగొన్నాము.

నివేదిక ప్రకారం.. స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గం అమేథీకి రెండు రోజుల పర్యటన సందర్భంగా గౌరీగంజ్‌లోని స్థానిక దుకాణంలో చాకొలేట్లు, చిప్స్ ప్యాకెట్లు కొనుగోలు చేసింది. ప్లాస్టిక్ సంచులను ఉపయోగించవద్దని ఇరానీ దుకాణదారులను కోరారు.

మేము సెప్టెంబర్ 21, 2019 న NDTV, ఆజ్ తక్ నివేదికలను కూడా చూశాము. రెండు రోజుల అమేథీ పర్యటనలో గౌరీగంజ్‌లోని దుకాణంలో అప్పటి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్థానికంగా టాఫీలు, చిప్స్ కొనుగోలు చేశారని రెండు నివేదికలు పేర్కొన్నాయి.

ఆజ్ తక్ నివేదిక ప్రకారం మీడియాతో షాపు యజమాని మాట్లాడాడు. స్మృతి ఇరానీ తన దుకాణంలో 35 రూపాయల విలువైన టాఫీలు, చిప్స్ లను కొనుగోలు చేసినట్లు షాప్ యజమాని గుడ్డు చెప్పాడు."నేను ఆమె కొన్న వస్తువులకు సంబంధించి ప్లాస్టిక్ బ్యాగ్ ఇవ్వగా.. ఆమె దానిని తీసుకోవడానికి నిరాకరించారు. ప్లాస్టిక్ సంచులను ఉపయోగించవద్దని సూచించారు." అని తెలిపాడు.

కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో పాతది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. స్మృతి ఇరానీ అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన తర్వాత ఆమె రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో వస్తువులు కొన్నట్లు చూపలేదని మేము నిర్ధారించాము.

Credit : Md Mahfooz Alam

Next Story