FactCheck : చైనాకు చెందిన వీడియో లిబియాలో చోటు చేసుకున్నదంటూ ప్రచారం

లిబియా దేశంలో వరదలు భీభత్సం సృష్టించాయి. మరణాల సంఖ్య 11 వేలు దాటింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2023 3:30 PM GMT
FactCheck : చైనాకు చెందిన వీడియో లిబియాలో చోటు చేసుకున్నదంటూ ప్రచారం

లిబియా దేశంలో వరదలు భీభత్సం సృష్టించాయి. మరణాల సంఖ్య 11 వేలు దాటింది. 10 వేల మందికి పైగా అదృశ్యమయ్యారు. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింది. ఇంకా 10 వేల మంది ఆచూకీ దొరకడం లేదు. వరదల్లో ముగినిపోయిన డెర్నాలో అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. బురదలో కూరుకుపోయిన భవనాల్లో చిక్కుకొని మరణించిన వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పిపోయిన వారంతా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

భారీగా వరదలు ఉన్న ప్రాంతంలో బుల్డోజర్ ప్రజలను రక్షించడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో లిబియాలో విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను చూపుతుందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.


“Libya: Successful rescue operation…Libya flooding disaster. #LibyaFloods #Libya.” అంటూ పలువురు పోస్టులు పెట్టింది.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వీడియో లిబియాకు సంబంధించినదని కాదని తెలిసింది. ఆ వీడియో చైనాకు చెందినదని న్యూస్‌మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్‌స్ పై రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. చైనా స్టేట్ మీడియా, పీపుల్స్ డైలీ ఆగస్టు 1, 2023న Xలో పోస్ట్ చేసిన అదే వీడియోను మేము కనుగొన్నాము. బీజింగ్‌లో పైకప్పుపై ఇరుక్కున్న కుటుంబాన్ని రక్షించేందుకు ఓ వ్యక్తి బుల్డోజర్‌ను ఉపయోగించినట్లు అందులో తెలిపారు.

చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ (CGTN) ఆగస్టు 1, 2023న ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. బీజింగ్‌లో వరద నీటిలో చిక్కుకున్న ముగ్గురిని రక్షించడానికి మనిషి ట్రాక్టర్‌ని ఉపయోగించాడని తెలిపారు. “Man uses tractor to rescue three people trapped in floodwaters in Beijing.” అంటూ చెప్పుకొచ్చారు.


CNN, ఒక నివేదికలో, వీడియో కు సంబంధించిన స్టిల్‌ను ఉపయోగించింది. బీజింగ్‌లో టైఫూన్ వరద నీటిలో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని రక్షించారు.

కాబట్టి, వైరల్ వీడియో లిబియాకు సంబంధించినది కాదు. చైనాలోని బీజింగ్‌లో వరదల్లో చిక్కుకున్న కుటుంబాన్ని రక్షించే వీడియో అని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.

Credits : Md Mahfooz Alam

Claim Review:చైనాకు చెందిన వీడియో లిబియాలో చోటు చేసుకున్నదంటూ ప్రచారం
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story