చాలా మంది ద్విచక్రవాహనదారులు ఫ్లైఓవర్‌పైన ప్రయాణిస్తూ జారిపోవడంతో గాయాలు పాలవుతున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద భారీ వర్షం కారణంగా ఇది జరిగిందని వినియోగదారులు పేర్కొంటున్నారు.
గత వారం హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లో 92.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. "షేక్‌పేట్ ఫ్లైఓవర్ పై ఇది చోటు చేసుకుంది. వర్షాకాలంలో ఆ ఫ్లై ఓవర్ పై వెళ్లడాన్ని నివారించండి" అనే టెక్స్ట్‌తో వీడియో షేర్ చేయబడుతోంది. "Shaikpet flyover, 2W avoid it in rains" అని వైరల్ పోస్టులో ఉంది.
ఈ వీడియోను వెరిఫై చేయాలని న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ వచ్చింది.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ ఇన్‌విడ్ సెర్చ్ ను నిర్వహించింది. ఈ సంఘటనపై నివేదించిన పలు మీడియా సంస్థల కథనాలను కనుగొన్నాము. అయితే, ఆ ప్రదేశం పాకిస్థాన్‌లోని కరాచీ అని తేలింది.
పాకిస్తాన్ మీడియా సంస్థ అయిన GEO TV ప్రకారం, జూన్ 22న కరాచీలోని వివిధ ప్రాంతాలలో ఊహించని దుమ్ముతో కూడిన భారీ వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లుపై చాలా మంది మోటార్‌సైకిల్‌దారులు పడిపోవడం, గాయపడడం జరిగింది. మిలీనియం మాల్ సమీపంలోని రషీద్ మిన్హాస్ రోడ్డులోని ఫ్లై ఓవర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. చాలా మంది ద్విచక్రవాహనదారులు ఫ్లై ఓవర్ పైకి వస్తున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు రోడ్డుపై జారిపోతున్నారు. ఇతర వాహనాలలో ప్రయాణించేవారు పడిపోయిన మోటార్‌సైకిల్‌దారులకు సహాయం చేయడానికి తమ తమ వాహనాలను ఆపివేశారు.
https://www.geo.tv/latest/423925-watch-multiple-motorcyclists-fall-on-slippery-karachi-roads-amid-rain
రిపబ్లిక్ వరల్డ్, ది వరల్డ్ న్యూస్, వన్ ఇండియా వంటి ఇతర మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయి.
https://www.youtube.com/shorts/u8DYhVAKjYY
వైరల్ వీడియో కరాచీలోని మిలీనియం మాల్ సమీపంలోని రషీద్ మిన్హాస్ రోడ్‌లోని ఫ్లైఓవర్ వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద కాదు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.