ఏరోఫ్లాట్ విమానం క్రాష్ ల్యాండింగ్‌ను చూపించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ విజువల్స్ భారతదేశానికి చెందినవిగా ప్రచారం చేస్తున్నారు. వీడియో శీర్షికలో : "Today plane accident save India people". అని ఉంది.
భారతదేశంలో ఇటువంటి ఘటన చోటు చేసుకుందా అని వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
విమానం రన్‌వేపై అదుపు తప్పడంతో మంటలు అంటుకోవడం మనం చూడవచ్చు. అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రయాణికులు విమానం ఎమర్జెన్సీ స్లైడ్‌ల నుంచి తప్పించుకున్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం భారతదేశంలో ఇటీవల ఏదైనా ఇలాంటి విమాన ప్రమాదం చోటు చేసుకుందా అని ఇంటర్నెట్ లో వెతికింది. ఇటీవలి కాలంలో అలాంటి సంఘటన జరగలేదని కనుగొన్నారు.
'ఏరోఫ్లాట్'ను క్లూగా ఉపయోగించి, NewsMeter కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. CNN, NDTV ద్వారా 5 మే -2019 నాటి వార్తా నివేదికలను కనుగొన్నాము. ఈ సంఘటన 2019లో జరిగిందని స్పష్టం చేసింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించగా.. మే 06, 2019 తేదీ నాటి అదే సంఘటనకు సంబంధించిన సారూప్య క్లిప్‌లను మేము కనుగొన్నాము. ది గార్డియన్ ఈ వీడియోను 'More than 40 people onboard a Russian Aeroflot passenger plane were killed on Sunday after the aircraft caught fire as it made a bumpy emergency landing at a Moscow airport' అంటూ పోస్ట్ చేసింది.
ఇదే వీడియోను ఏప్రిల్ 16, 2022న 'ది టెలిగ్రాఫ్' కూడా ప్రచురించింది. గత సంవత్సరం మాస్కోలో 41 మంది మరణించిన విమానం అగ్నిప్రమాదానికి సంబంధించిన కొత్త ఫుటేజీని విడుదల చేశారు. షెరెమెటివో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. "New footage has been released of a plane fire which killed 41 people in Moscow last year. The harrowing clips show desperate passengers fleeing 100ft flames after an emergency landing at Sheremetyevo airport. The plane was airborne briefly before returning to make an emergency landing, and, still heavy with unburned fuel, the jet ignited after a rough touchdown. Ten people were injured and 37 people escaped from the plane alive. The pilot Denis Evdokimov has been formally charged with negligence over the crash landing," అని టెలీగ్రాఫ్ లో కథనం కనిపించింది.
మాస్కో లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల భారతదేశంలో జరిగిన సంఘటనగా వైరల్ అవుతున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదు.