ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించిన తర్వాత విలేకరుల సమావేశంలో ఒక పాత్రికేయుడి ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోపంగా స్పందించినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జర్నలిస్టుతో కోపంగా మాట్లాడారంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
“నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక విలేకరి బడ్జెట్ గురించి ఒక ప్రశ్న అడిగారు. ఆమె కోపంతో వెళ్లిపోయింది." అని ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేస్తూ రాశారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియో 2023లో బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించిన వీడియో అని NewsMeter కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫిబ్రవరి 2023లో వినియోగదారులు పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. వినియోగదారుల్లో ఒకరు వీడియోను ‘arrogant and shameful remark by Finance Minister #Budget2023.’ అని క్యాప్షన్ ఇచ్చారు. మరొక X పోస్ట్ చేసిన వీడియో ఉంది. ఫిబ్రవరి 2023లో వినియోగదారులు ఈ వీడియోను పోస్టు చేశారు.
పై పోస్ట్‌ల ద్వారా వీడియో పాతదేనని నిర్ధారించాము. ఈ వీడియోలో బ్రూట్ అనే మీడియా సంస్థ లోగో కూడా ఉంది. దీన్ని ఒక సూచనగా తీసుకొని, మేము సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. ఫిబ్రవరి 1, 2023న YouTubeలో బ్రూట్ ఇండియా ప్రచురించిన వీడియోను మేము కనుగొన్నాము. “This was FM’s reply when a journalist tried to convey the Opposition’s view on the Budget,” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
బడ్జెట్ 2023 తర్వాత సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌పై 'మింట్' నివేదికను కూడా మేము చూశాము. కేంద్ర బడ్జెట్ 2023 సరిపోదని ప్రతిపక్ష పార్టీలు చెప్పాయని ఒక విలేఖరి అడిగినప్పుడు మంత్రి సీతారామన్ ప్రతిపక్షాల విమర్శల గురించి పెద్దగా పట్టించుకోలేదు.
అందువల్ల, వైరల్ క్లిప్ 2023 బడ్జెట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించినదని స్పష్టంగా తెలుస్తోంది. ఒక సంవత్సరం కిందటి వీడియోను 2024 బడ్జెట్‌తో తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam