Fact Check : హిమాచల్ ప్రదేశ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ నిజమేనా..?

Video of Massive Traffic Jam is From Pakistan not Himachal Pradesh. రోడ్డు మీద పెద్ద ఎత్తున వాహనాలు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2021 6:11 AM GMT
Fact Check : హిమాచల్ ప్రదేశ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ నిజమేనా..?
రోడ్డు మీద పెద్ద ఎత్తున వాహనాలు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. హిమాచల్ ప్రదేశ్ కు టూరిస్టులు తరలి వెళ్తున్న వీడియో అంటూ పలువురు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు. కొద్దిరోజుల కిందట పెద్ద ఎత్తున పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ లోని హిల్ స్టేషన్స్ కు వెళ్లారు. అప్పటి వీడియో ఇదంటూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు కొందరు.

"Wanna go for a lovely, relaxing holiday to Khandala? Enjoy the rains, a beautiful long drive #Weekend #travel." అంటూ భైరవి గోస్వామి కూడా వీడియోను పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నూర్ లో ఇటీవలే కొండచరియలు విరిగి పడ్డాయి. భారీ వర్షాలకు తోడు హిమాచల్ ప్రదేశ్ లో వరదల కారణంగా పర్యాటకులు ఇప్పుడు అక్కడికి వెళ్లడం సబబు కాదని అధికారులు చెబుతూ ఉన్నారు. చాలా ప్రాంతాలు వరదల కారణంగా జలదిగ్బంధంలో ఉన్నాయి.


కొండచరియలు విరిగిపడిన ఘటనల గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనాలను చూడొచ్చు. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు.

https://timesofindia.indiatimes.com/city/shimla/in-pics-landslide-in-himachal-pradeshs-kinnaur-claims-nine-lives/photostory/84750427.cms

వైరల్ పోస్టులను స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇది భారత్ లో కాదని తెలిసింది. పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఘటన. జులై 26, 2021న యూట్యూబ్ ఛానల్ లో వీడియోను చూడొచ్చు.


ఈదుల్ అదా కోసం రికార్డు సంఖ్యలో ఖైబర్ పఖ్తుంఖ్వా యొక్క మన్సెహ్రా జిల్లాలోని కఘన్ లోయకు పర్యాటకులు తరలివచ్చినట్లు వీడియో వివరణలో ఉంది. వందలాది వాహనాలు రోడ్ల మీదకు రావడంతో పర్యాటక ప్రదేశంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

న్యూస్ 24 కథనం ప్రకారం జులై 25, 2021న కొన్ని వేల వాహనాలు కఘన్ లోయకు వచ్చాయి. పలు పాకిస్తాన్ మీడియా సంస్థలు కూడా ఈ వీడియోను టెలికాస్ట్ చేశాయి. అందుకు సంబంధించిన కథనాలను ప్రసారం చేశాయి. ఆ ప్రాంతంలో రోడ్లు మొత్తం బ్లాక్ అవ్వగా.. టూరిస్టుల తాకిడికి హోటల్స్ హౌస్ ఫుల్ అయ్యాయట..! మరికొందరైతే ఈ ప్రాంతానికి రాకండి.. పార్కింగ్ చేయడానికి ప్రదేశం కూడా దొరకదు అంటూ ట్వీట్లు చేశారు.

కాబట్టి వైరల్ అవుతున్న వీడియో హిమాచల్ ప్రదేశ్ కు చెందినది కాదు. ఈ వీడియో పాకిస్తాన్ కు చెందినది.


Claim Review:హిమాచల్ ప్రదేశ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ నిజమేనా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story