పెట్రోల్ పంపులో పని చేసే ఓ ఉద్యోగిని కిడ్నాప్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. బండికి ఇంధనాన్ని వేయించుకున్న తర్వాత కారు దగ్గరకు వెళ్లిన ఉద్యోగిని వెనుక నుండి మరొక వ్యక్తి లోపలికి తోసేయడం.. కారులో ఉన్న మరో వ్యక్తి లాక్కొని వెళ్లిపోవడం.. వెంటనే వేగంగా కారు కూడా వెళ్లిపోవడం జరిగిన వీడియో వైరల్ అవుతూ ఉంది. 45 సెకండ్ల సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని బదౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుందంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
రామ రాజ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయంటూ పలువురు ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుందంటూ పోస్టులను పెట్టడం గమనించవచ్చు. అతడి దగ్గర ఉన్న క్యాష్ ను లాక్కోడానికే ఈ కిడ్నాప్ చేశారని పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ :
వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోలేదు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. Gulf News లో ఈ ఘటనకు సంబంధించిన వార్తను చూడొచ్చు. అలాగే వైరల్ ఘటనకు సంబంధించిన వీడియో లింక్ ను కూడా చూడొచ్చు. అక్టోబర్ 2, 2021న ఈ ఘటనకు సంబంధించిన కథనాన్ని పబ్లిష్ చేశారు.
సౌదీ అరేబియా లోని హైల్ (HAIL) నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కిడ్నాప్ కు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వార్తా నివేదిక ప్రకారం.. హైల్ పోలీసు మీడియా ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ షమీ అల్-షమ్మారి మాట్లాడుతూ " ఈ ఘటనకు సంబంధించి రెండు దాడులు మరియు దోపిడీకి పాల్పడిన ముగ్గురు పౌరులు అరెస్టు చేయబడ్డారు. రెండు గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తున్న వారిపై వీరు దాడి చేశారు. వారిని అరెస్టు చేసినప్పుడు వారు మాదకద్రవ్యాలను కలిగి ఉన్నారు. " అని తెలిపారు. వారు ఇంకో గ్యాస్ స్టేషన్ లో పని చేసే వ్యక్తిపై కూడా దాడికి తెలుస్తోంది.
https://mykuwaits.com/world/gulf-news/arrest-of-3-saudis-who-kidnapped-asians/amp/
https://www.eremnews.com/entertainment/legal-cases/2347016
Saudi Arabia Public Security కి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఉంచారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురిని అరెస్టు చేసి.. అదుపులోకి తీసుకున్నామని ట్వీట్ లో తెలిపారు.
https://www.arabtimesonline.com/news/gas-station-worker-kidnapped-caught-on-camera/ వెబ్సైట్ లో కూడా ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు.
కాబట్టి వైరల్ వీడియోలో ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుందంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది.