హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలో నకిలీ టీచర్ల గురించి ఓ జర్నలిస్టు బయటపెడుతున్నాడంటూ సోషల్ మీడియా యూజర్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
వైరల్ పోస్టును NewsMeter పరిశీలించింది. మేము వీడియో మొదటి సెకనులోనే హర్ష్ రాజ్‌పుత్ యూట్యూబ్ ఛానెల్ కు సంబంధించి వాటర్‌మార్క్‌ని గమనించాము.
పోస్ట్‌లో రిపోర్టర్ పేరు హర్ష్ రాజ్‌పుత్ అని కూడా చూపించారు. మేము సంబంధిత కీ వర్డ్స్ ను ఉపయోగించి ఇంటర్నెట్‌లో శోధించగా.. జూలై 19, 2022న హర్ష్ రాజ్‌పుత్ యూట్యూబ్ ఛానెల్‌లో అదే వీడియో కనుగొన్నారు. హర్ష్ రాజ్‌పుత్ 'ధాకడ్ న్యూస్' వార్తా ఛానెల్‌కు చెందిన రిపోర్టర్ ముసుగులో వీడియోలను సృష్టించారు. ఈ వీడియోను వినోదం, అవగాహన కోసం రూపొందించిన స్క్రిప్ట్ అని హర్ష్ రాజ్‌పుత్ అభివర్ణించారు.
https://instagram.com/harshrajputin?igshid=YmMyMTA2M2Y=
"వీడియో పూర్తి కల్పితం. వీడియోలోని అన్ని ఈవెంట్‌లు స్క్రిప్ట్ చేశారు. కేవలం వినోద ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించారు" అని వీడియోలో పేర్కొన్నారు."The video is a complete fiction and all the events in the video are scripted and made for entertainment purposes only. This does not promote any kind of activity or defame any kind of rituals," అంటూ డిస్క్లైమర్ లో చూపించారు. నిజమైన వ్యక్తులు, జీవించి ఉన్నవారు, చనిపోయినవారు లేదా వాస్తవ సంఘటనలతో ఏదైనా పోలిక ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికమని తెలిపారు.
హర్ష్ రాజ్‌పుత్ రాసిన ఇతర స్క్రిప్ట్ వీడియోలను అతని ఫేస్‌బుక్ పేజీలో చూడవచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.